Home

»

Latest News

పవన్ భక్తుడి పబ్లిసిటీ చూడండి!

Jul 4, 2016 12:24PM


"గోపాల గోపాల" సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "శ్రీకృష్ణుడిగా" టైటిల్ పాత్ర పోషించగా.. అసలు దేవుడంటే పడని నాస్తికుడు గోపాల్రావుగా వెంకటేష్ కనిపించాడు. సినిమా ఎండింగ్ లో అతను కూడా పవన్ కళ్యాణ్ కు భక్తుడిగా మారిపోతాడనుకోండి (ఆదేలెండి కృష్ణుడికి). ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే.. కథానాయకుడిగా విక్టరీ వెంకటేష్ కు మంచి హిట్లతోపాటు ఫ్యామిలీ హీరో అన్న పేరు ఉన్నప్పటికీ.. మిగతా హీరోలతో కంపేర్ చేసే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం లేదు. అలాగని వెంకీని ఇష్టపడనివారు లేరని కాదు.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ ల వీరాభిమానుల స్థాయిలో ఆరాధించే వ్యక్తులు లేరు. 
అందుకే దగ్గుబాటి అభిమానులు నడుం బిగించారు. తమ హీరో (వెంకటేష్) మిగతా హీరోలతో పోల్చితే తక్కువేమీ కాదని నిరూపించడానికి సన్నద్ధమవుతున్నారు. త్వరలో వెంకీ లేటెస్ట్ ఫిలిమ్ "బాబు బంగారం" ఆడియో విడుదల జరగనుండగా.. ఇప్పట్నుంచే వెంకీ అభిమానులు, ఆయన ఫోటో ఉన్న టీషర్టులను పబ్లిసిటీ చేస్తున్నారు. ఆడియో వేడుకకు ఆ టీషర్టులు వేసుకొని రెడీ హాజరయ్యేలా ప్రణాళికలు వేసుకొంటున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన లభించడంతో "బాబు బంగారం" సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అఖిలాంధ్ర వెంకటేష్ అభిమానులందరూ ఆశతో ఎదురుచూస్తున్నారు!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com