
శర్వానంద్, నిత్యమీనన్ జంటగా నటించిన 'రాజాధిరాజా' సినిమా తమిళంలో సీడీల రూపంలో విడుదలయ్యి మంచి పేరే తెచ్చుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని భావించిన చిత్ర బృందం రీసెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా విడుదల చేసేసారు. ఈ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా సినీ జనాలకు తెలీదు. కారణం.. ఎలాంటి పబ్లిసిటీ లేకపోవడమే. శర్వానంద్ ఈ సినిమాని అస్సలు పట్టించుకోలేదు. పైగా ఆ సినిమాతో నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ విషయంపై దర్శకుడు చేరన్ హీరో శర్వానంద్‌పై ఫైర్ అవుతున్నాడు. శర్వాపై తనకున్న అసహనాన్ని మీడియా ముందు వ్యక్తం చేశాడు. శర్వానంద్‌ని ఎంత బతిమాలినా ప్రమోషన్లకు రాలేదని, ఈ సినిమాని చిన్న చూపు చూశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అవకాశాల్లేనప్పుడు శర్వాని పిలిచి.. సినిమా ఇచ్చానని, అయితే శర్వానంద్ మాత్రం తనకు హ్యాండిచ్చాడని చెబుతున్నాడు చేరన్. ఓ దర్శకుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నానే, శర్వానంద్ ప్రమోషన్లకు రాకపోయినా.. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఈ సినిమా విడుదలైనా.. చూసిన ప్రేక్షకులు మాత్రం బావుందని మెచ్చుకుంటున్నారని చెప్పుకొంటున్నాడు!






