Home

»

Latest News

రవితేజ "వీర" హైదరాబాద్ లో

Mar 24, 2011 3:22PM

ravia teja wallpapers, ravia teja stills, ravia teja images, ravia teja pics, ravia teja photos, ravia teja   picturesరవితేజ హీరోగా నటిస్తున్న"వీర" చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతూంది. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "వీర". ఈ "వీర"చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబోలిలోని వై యస్ ఆర్ స్టేడియమ్ లో జరుగుతూంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ పక్కా మాస్ పాత్రలో నటిస్తూంది.

కాజల్ అగర్వాల్ పాత్ర పేరు"కబడ్డీ చిట్టి". ఈ "వీర" చిత్రంలో నటిస్తున్న తాప్సి మాత్రం క్లాస్ పాత్రలో ఐ టి ప్రొఫెషనల్ గా నటిస్తూందని సమాచారం. ఈ "వీర" చిత్రం షూటింగ్ ముందు రామోజీ ఫిలిం సిటీలోనూ, మొన్నటి వరకూ స్టీల్ సిటీ విశాఖ పట్టణంలో, అరకు లోయ తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ చిత్రం తనకు ష్యూర్ షాట్ హిట్టని ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రవితేజ అభిప్రాయపడుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com