Home

»

Latest News

ఏప్రెల్ 1 న యన్ టి ఆర్ శక్తి విడుదల

Mar 25, 2011 10:19AM

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr picturesతెలుగువన్ డాట్ కామ్ ముందుగా చెప్పినట్లుగానే యన్ టి ఆర్ "శక్తి" ఏప్రెల్ 30 న కాకుండా ఏప్రెల్ 1 న విడుదల కానుంది. వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, నలకనడుము అందాల గోవా భామ ఇలియానా హీరోయిన్ గా, "కంత్రీ, బిల్లా" ఫేం మెహెర్ రమేష్ దర్శకత్వంలో, చలసాని అశ్వనీదత్ నిర్మిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం"శక్తి". ఈ "శక్తి" చిత్రానికి మణిశర్మ సంగీతం అందించిన ఆడియో ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" ముందుగా అనుకున్న ప్రకారం ఏప్రెల్ 30 వ తేదీన విడుదల కావలసి ఉంది. కానీ ఈ చిత్రం ఏప్రెల్ 1 వ తేదీన విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మార్చ్ 30 వ తేదీన ఉండటం వల్ల, అదికూడా చిరకాల ప్రత్యర్థి, మన దాయాది అయిన పాకిస్తాన్ తో భారత్ ఆ మ్యాచ్ లో ఆడబోతున్నందువల్లా దేశం యావత్తూ ఆ మ్యాచ్ మీదే దృష్టి సారిస్తుందనీ, అందుకే ఈ యన్ టి ఆర్ శక్తి విడుదల ఏప్రెల్ 30 న కాకుండా ఏప్రెల్ ఒకటిన ఆల్ ఫూల్స్ డే రోజున విడుదల చేయనున్నారట. అవును మరి పాకిస్తాన్ తో ఇండియా మ్యాచ్ అంటేనే జనానికి ఇంట్రెస్ట్. అందులోనూ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఇక చెప్పేదేముంది. ఆ రోజు ఆదిశక్తి దర్శనమిస్తానన్నా జనం చూడరు. ఇక యన్ టి ఆర్ "శక్తి"ని ఇంకెక్కడ చూస్తారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com