Home

»

Latest News

పవన్ కళ్యాణ్ తీన్ మార్ శాటిలైట్ 7 కోట్లు

Mar 24, 2011 2:47PM

 pawan kalyan wallpapers, pawan kalyan stills, pawan kalyan images, pawan kalyan pics, pawan kalyan photos, pawan kalyan picturesపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు 7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని సమాచారం. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష, కృతి కర్బందా హీరోయిన్లుగా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్నచిత్రం "తీన్ మార్". బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" చిత్రానికిది రీమేక్. అయితే ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కుల కోసం చాలా శాటిలైట్ ఛానల్స్ పోటీపడ్డాయి.

ఎన్ని ఛానల్స్ పోటీపడినా ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "తీన్ మార్" చిత్రం యొక్క శాటిలైట్ హక్కులు 7 కోట్ల రూపాయలకు "మా" టివి సొంతం చేసుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. ఇంతవరకూ అమ్ముడైన సినిమాల శాటిలైట్ రేట్లలో పవన్ కళ్యాణ్ "తీన్ మార్" శాటిలైట్ రేటే అత్యధికమని సమాచారం. మణి శర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల ఘనంగా విడుదలైంది. ఈ ఆడియోకి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com