మే 6 న రవితేజ వీర ఆడియో రిలీజ్
on May 6, 2011
రవితేజ "వీర" ఆడియో రిలీజ్ "మే" 6 వ తేదీన హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో సాయంత్రం 7 గంటలకు జరుతుంది. వివరాల్లోకి వెళితే శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, "రైడ్" ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "వీర". రవితేజ "వీర" చిత్రంలో హీరో రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కబడ్డి చిట్టి అనే పక్కా మాస్ పాత్రలో నటిస్తూండగా, సొట్టబుగ్గల సుందరి తాప్సి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నటుస్తుంది.
.jpeg)
రవితేజ "వీర" చిత్రానికి యువసంగీత దర్శకుడు తమన్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. రవితేజ "వీర" చిత్రం యొక్క ఆడియో హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో "మే" 6 వ తేదీ రాత్రి 7 గంటలకు జరుగుతుంది. ఈ ఆడియో విడుదలకు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. రవితేజ "వీర" చిత్రాన్ని "మే" నెలాఖరులో విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత గణేష్ ఇందుకూరి సన్నాహాలు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



