మెగాకుర్రాడు భలే మారిపోయాడు సుమీ..!
on Mar 15, 2016
నాగబాబుగారబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడనగానే, ఎలా ఉంటాడు అంటూ అందరూ చాలా ఆసక్తి చూపించారు. వరుణ్ ఫోటోలు చూడగానే, అబ్బో హాలీవుడ్ హీరోయే అంటూ కితాబిచ్చేశారు. లేటెస్ట్ ఫోటో చూస్తే మాత్రం, ఎవరో హాలీవుడ్ కుర్రాడే అనుకోవడం కన్ఫామ్. సినిమా సినిమాకు తనలో మార్పు చూపిస్తున్న వరుణ్ తేజ్, తర్వాత చేయబోతున్న శ్రీను వైట్ల సినిమా కోసం ఈ కొత్త గెటప్ లోకి దిగాడు. లోఫర్ ప్రమోషన్ టైంలో గడ్డం, మీసం పెంచుకుని కనిపిస్తుంటే, ఎందుకో అనుకున్నారందరూ. శ్రీనువైట్ల సినిమా కోసమని ఈ ఫోటోతో బయటపడింది. ముకుందలో పక్కింటి కుర్రాడిలా, కంచెలో సైనికుడిగా, లోఫర్ లో టైటిల్ కు తగ్గట్టుగా తన గెటప్స్ లో ఛేంజ్ చూపించాడు వరుణ్. ఇప్పుడు గెటప్ లో సినిమా ఏ స్టోరీ అయ్యింటుందబ్బా అంటూ మెగాభిమానులు ఇప్పటికే గెస్సింగ్ మొదలెట్టేశారు. దీని బట్టి చూస్తే శ్రీను వైట్ల కూడా హిట్ కోసం, పాత ఫార్ములా పక్కన పెట్టి, ఏదో కొత్తదనాన్నే చూపిస్తున్నాడనుకోవచ్చు. మరి ఈ గెటప్పెందుకో లెట్స్ వెయిట్ అండ్ సీ..