వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ 'మట్కా'.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
on Jul 27, 2023

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'గాండీవధారి అర్జున' ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తన 13వ సినిమాని శక్తి ప్రతాప్ సింగ్ అనే నూతన దర్శకుడితో చేస్తున్నాడు. ఇక ఇప్పుడు 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ 14వ సినిమా ప్రారంభమైంది.
నానితో 'హాయ్ నాన్న' చిత్రాన్ని నిర్మిస్తున్న వైరా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.2 గా వరుణ్ 14వ సినిమాని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి 'మట్కా' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. పూజా కార్యక్రమాలతో నేడు(జూలై 27) ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టైటిల్ తో కూడిన కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. 1970-80 ప్రాంతంలో జరిగే కథతో రూపొందుతోన్న పీరియాడిక్ ఫిల్మ్ ఇది. డబ్బులు, కారు, ఇల్లు వంటి వారితో రూపొందించిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, నోరా ఫతేహి ప్రత్యేక పాత్రలో అలరించనుంది. ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



