ఆకట్టుకుంటున్న 'ఇందువదన' టీజర్.. వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలా ఉన్నాడు
on Aug 4, 2021
'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' సినిమాలతో కెరీర్ స్టార్టింగ్ లో భారీ హిట్స్ అందుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ సరైన హిట్ ని మాత్రం అందుకోలేకపోయాడు. చాలా కాలం తర్వాత వరుణ్ సందేశ్ 'ఇందువదన' అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే విడుదలైన 'ఇందువదన' పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. లవ్, థ్రిల్లింగ్ అంశాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ను చూపిస్తూనే యాక్షన్ సన్నివేశాలను చూపించారు. ఇక చివరిలో హీరోయిన్ ను దెయ్యంలా చూపించడం ఉత్కంఠని రేకెత్తిస్తోంది. అలాగే మ్యూజిక్ కూడా ఈ టీజర్ కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చూస్తుంటే 'ఇందువదన'తో వరుణ్ హిట్ ట్రాక్ లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు.
'ఇందువదన'లో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎంఎస్ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ బాలాజీ పిక్చర్స్ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న ఈ సినిమాకి శివ కాకాని సంగీతం అందిస్తున్నాడు.
Also Read