Home

»

Latest News

The Paradise: తస్మాత్ జాగ్రత్త: కంటెంట్ బాగోపోతే.. దుకాణ్ బంద్!

Sep 24, 2026 11:55AM


బండి మీద ఇల్లు ఇల్లు తిరిగి పెద్ద ఉల్లిపాయలు, స్టీల్ సామాన్లు అమ్ముకునే వాళ్లే మేము  
పలానా ఐటమ్స్ అమ్ముతున్నామని కస్టమర్స్  ఎట్రాక్ అయ్యేలా ఒక ప్రాసెస్ ప్రకారం పిలుస్తూ ఉంటారు. అంటే కంటెంట్. మరి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అంతకంటే గొప్పదైన టైంని కూడా ఉపయోగించి సినిమా తెరకెక్కిస్తునప్పుడు కంటెంట్ ఎంత బాగుండాలి. 


కానీ నిన్న ప్రీమియర్స్ నుంచే  ఎన్నో అంచనాలతో విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రం చూస్తే కంటెంట్ ని గాలికి వదిలేశారని క్లియర్ గా అర్ధమవుతుంది. పని చేసే వాళ్ళకంటే పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువయ్యారని, దైవం లాంటి  కంటెంట్ గొప్ప తనం తెలియని మేధావులు తలదూర్చి 'షో' చేశారనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. ఇప్పుడు ఇదే టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ఈ నెగెటివ్ టాక్‌కి ప్రధాన కారణం ఏంటి? మేకర్స్ కథలోని కీలకమైన కంటెంట్‌ను పక్కన పెట్టి, కేవలం భారీతనం పైనే దృష్టి పెట్టడం వల్ల ఈ పరిస్థితి ఎదురైందా అనే ప్రశ్నలు గట్టిగా వినిపిస్తున్నాయి. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రమోషన్ల సమయంలో మేకర్స్ ఇచ్చిన హైప్, మేకింగ్ వీడియోలు చూసి ప్రతి ఒక్కరూ థియేటర్లలో ఏదో కొత్త అనుభూతిని పొందుతామని ఆశించారు.

అయితే, సినిమా థియేటర్లలోకి వచ్చాక అసలు కథే వేరుగా మారిపోయింది. కథనంలో అసలైన కంటెంట్, బలమైన ఎమోషన్స్ కొరవడటమే దీనికి ప్రధాన కారణం. గెటప్స్, కెమెరా యాంగిల్ కోసం సినిమా తీయ్యడం ఏంటి? దాదాపు 150 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో మొదటి 45 నిమిషాల పాటు కేవలం క్యారెక్టర్ ఎలివేషన్లు, అద్భుతమైన విజువల్స్ చూపించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. దర్శకుడు విజువల్ ప్రెజెంటేషన్ పై చూపించిన శ్రద్ధలో 30 శాతం కూడా కథా కథనాల పై చూపించలేకపోయారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే కీలకమైన సీన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. 20 నుంచి 25 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ ఫైట్ కేవలం సాంకేతికంగా బాగుందే తప్ప, ప్రేక్షక హృదయాలను తాకలేకపోయింది.

 

 

ఇది కూడా చదవండి: The Paradise Movie Review Telugu: ది ప్యారడైజ్ మూవీ రివ్యూ  

ఈ రోజుల్లో ప్రేక్షకులు కేవలం సెట్లు, డ్రోన్ షాట్లు, లేదా భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చూసి సంతోషపడే పరిస్థితిలో లేరు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా తిరస్కరించే చైతన్యం ప్రేక్షకుల్లో వచ్చింది. ‘ది పారడైజ్’ విషయంలో మేకర్స్ ఈ చిన్న సూత్రాన్ని విస్మరించి తప్పు చేశారా అనే సందేహం వ్యక్తమవుతోంది.ప్రేక్షకులు అంత అమాయకులా, కేవలం పబ్లిసిటీ గిమ్మిక్కులతో సినిమాని ఆదరిస్తారా అనుకోవడం విశ్లేషకుల ఆలోచనా విధానానికే పెద్ద సవాలుగా మారింది. సినిమా బడ్జెట్‌లో 60 శాతానికి పైగా కేవలం యాక్షన్ ఘట్టాలు, విఎఫ్ఎక్స్ (VFX) పనులకే వెచ్చించిన మేకర్స్, స్క్రిప్ట్ అభివృద్ధికి తగినంత సమయం కేటాయించలేకపోయారు. మేకర్స్ ఇప్పటికైనా కేవలం గ్రాఫిక్స్, భారీతనం వెనుక పరుగులు తీయకుండా కంటెంట్‌కి  ప్రాధాన్యత ఇస్తేనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగలరని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రేక్షకులు కూడా పెద్ద హీరో, హిట్ కాంబినేషన్ అని థియేటర్స్ కి వసున్నారు. దయచేసి సినిమాని ఖునీ చెయ్యకండి. 'షో' అనేది జస్ట్ ఒక వర్డ్ మాత్రమే.    దానిని సినిమాకి రుద్దితే ఎలా అని సోషల్ మీడియా వేదికగా సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.

 

[The Paradise Movie Anyalsis, The Paradise Movie Review Telugu, Nani, Srikanth odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com