మరచిపోయారనుకున్నా.. థాంక్స్
on Apr 5, 2017

వాణిశ్రీ...సావిత్రి తర్వాత ఒక తరాన్ని ఒక ఊపు ఊపిన నటి. ఆమె కట్టు, బొట్టు, హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్. కేవలం ఆమెను అనుకరించడానికే మహిళలు మళ్లీ మళ్లీ ఆమె సినిమాలు చూశారంటే అప్పట్లో వాణిశ్రీ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే 50 ఏళ్ల కెరీర్‌లో వాణిశ్రీకి అవార్డులు, రివార్డులు వచ్చింది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో 2013 సంవత్సరానికి గానూ రఘుపతి వెంకయ్య అవార్డ్‌కు వాణిశ్రీని ఎంపిక చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనిపై ఆమె స్పందించారు. నన్ను ఎంపిక చేసినందుకు ఆనందం కంటే వాణిశ్రీ అనే ఒక నటి ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆమె ఉద్వేగానికి గురయ్యారు. కెరీర్‌లో నాకు నచ్చిన పాత్రలకు న్యాయం చేయడానికే ప్రయత్నించాను కానీ అవార్డుల గురించి ఏనాడు ఆలోచించలేదు. డబ్బులిచ్చి కొనుక్కొవాలంటే 15 ఏళ్ల క్రితమే ఆ పని చేసేదాన్ని అంటూ తన ఆవేదనను బయటపెట్టారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



