Home

»

Latest News

వంగవీటిలో కమ్మ, కాపు లేదు

Dec 2, 2016 3:45PM

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వంగవీటి. దివంగత మాజీ ఎమ్మెల్యే , కాపునాడు నేత వంగవీటి మోహనరంగా జీవిత చరిత్రతో పాటు విజయవాడలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాలే ప్రధాని ఇతివృత్తంగా వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు ఎక్కడా పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు..కానీ సినిమా రిలీజ్‌కు దగ్గరవుతున్న కొద్ది అభ్యంతరాలు మొదలయ్యాయి.

ఈ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా చిత్రీకరిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  ఇదిలా ఉండగా వంగవీటి చిత్రంలోని కమ్మ, కాపు అనే పాటను తొలగిస్తున్నట్లు వర్మ ప్రకటించారు. కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ పాటను తీసేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com