Home

»

Latest News

సింహం గర్జన ఆలస్యం

Dec 3, 2016 8:17AM

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఎస్-3. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య నటించిన యముడు, సింగం-2 సూపర్‌హిట్ కావడంతో ఎస్-3పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 16గా ఫిక్స్ చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల విడుదలను డిసెంబర్ 23కి వాయిదా వేశారు. ఎస్-3 తెలుగు నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ విషయం తెలియజేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సినిమాను 23న విడుదల చేయాలని నిర్ణయించాం. కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొస్తున్నప్పటికీ సింగం గర్ఝనకి తిరుగుండదని ఆయన అన్నారు. సూర్య కెరీర్‌లోనే హైబడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన అనుష్క, శ్రుతిహాసన్ నటిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com