Home

»

Latest News

ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోకి నందమూరి హీరో..?

Dec 2, 2016 3:01PM

నందమూరి తారకరత్న..ఆ వంశం నుంచి వచ్చిన మూడో తరం హీరో. ఒకే రోజు తొమ్మిది చిత్రాలను ప్రారంభించిన సంచలన హీరో..వాటిలో దర్శకేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన "ఒకటో నెంబరు కుర్రాడు" మాత్రమే మనోడికి కెరిర్‌లో చెప్పుకోదగ్గ సినిమా..ఆ తర్వాత సినిమాలు చేసినా అవి అంత సక్సెస్ కాలేదు. హీరోగా ఛాన్సులు రాకపోవడంతో గేర్ మార్చి విలన్ వేషాలు కూడా వేశాడు..అక్కడ కాస్త పర్వాలేదనిపించినప్పటికీ ఆఫర్లు మాత్రం రాలేదు. దీంతో తన దృష్టిని రాజకీయాల వైపుకు మరల్చినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనిలో భాగంగా గత కొంతకాలంగా గుంటూరులోని తెలుగు యువత వర్గాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నాడట..అన్ని సెట్ అయితే తారక్ 2019 ఎన్నికల్లో గుంటూరు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయకతప్పదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com