ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ నటుడి సినిమా పోస్ట్ డిలీట్ చేసిన నటి
on Apr 23, 2025
'పహల్ గామ్'(Pahalgam)లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోగా, మరికొంత మంది గాయపడ్డారు. అత్యంత దారుణమైన ఈ ఘటనపై భారతదేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా నటులు కూడా జరిగిన ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు. మరికొంత మంది నటులు అయితే ప్రతీకారం తీర్చుకోవాలని కూడా కోరుతున్నారు.
బాలీవుడ్ లో వాణికపూర్(Vaani Kapoor)ఫవాద్ ఖాన్(Fawad Khan)జంటగా 'అభిర్ గులాల్'(Abir Gulaal)అనే మూవీ తెరకెక్కగా మే 9 న విడుదల కాబోతుంది. ఫవాద్ ఖాన్ పాకిస్థాన్ కి చెందిన నటుడు. ఉగ్రవాద దాడి జరిగిన రోజు వాణి కపూర్ సోషల్ మీడియా వేదికగా తమ సినిమాని ప్రమోట్ చేస్తు పోస్ట్ చేసింది. జరిగిన దాడి గురించి ప్రస్తావించకుండా మూవీని ప్రమోట్ చేయడంతో పలువురు వాణికపూర్ తీరుని తప్పు పడుతున్నారు. దీంతో ఆమె తన పోస్ట్ ని డిలీట్ చెయ్యడంతో పాటు మృతుల కుటుంబాలకి సానుభూతిని తెలియచేసింది. ఫవాద్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడిని ఖండించాడు.
'అభిర్ గులాల్' ని వివేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా 'ఆర్తి ఎస్ బగడి 'దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 2013 లో 'శుథ్ దేశి రొమాన్స్' చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వాణి కపూర్ ఇప్పటి వరకు ఎనిమిది సినిమాల్లో నటించింది. అభిర్ గులాల్ తో పాటు అజయ్ దేవగన్ తో చేస్తున్న 'రైడ్ 2 ' కూడా విడుదలకి సిద్ధంగా ఉంది. ఫవాద్ ఖాన్ బాలీవుడ్ లో ఇప్పటికే ఖుబ్సూరత్, కపూర్ అండ్ సన్స్ వంటి చిత్రాల్లో నటించాడు. ఉగ్రదాడి నేపథ్యంలో 'అభిర్ గులాల్' ని బ్యాన్ చెయ్యాలంటు ఎక్స్ లో హ్యాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
