మీకు పుణ్యం ఉంటుంది బాబు
on Nov 5, 2025

-అప్ డేట్ ఇస్తారా ఇవ్వరా!
-సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ డిమాండ్
-ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు
-భారీ స్థాయిలో నిర్మాణం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)'ఓజి' తో రావడం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం చకచకా జరిగిపోయాయి. పైగా ఫస్ట్ టైమ్ 300 కోట్ల గ్రాస్ ని సాధించడంతో ఫ్యాన్స్ సంబరాలు కూడా చేసుకున్నారు. పవన్ నుంచి రాబోయే చిత్రాలు కూడా ఇదే స్థాయిలో ఘన విజయాన్ని అందుకోవాలని కూడా వాళ్లంతా కోరుకుంటున్నారు. ప్రేక్షకుల్లో కూడా ఓజి విజయంతో పవన్ నెక్స్ట్ చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడినట్లే.
ఇక పవన్ నుంచి తదుపరి రాబోయే చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh).యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండగా పవన్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయనున్నాడు. పవన్ కి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకుడు కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ విషయంలో తగ్గేదెలే అనే విధంగానే ఉన్నాయి. పైగా అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి ఉండనే ఉంది. దీన్ని బట్టి ఉస్తాద్ స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఉస్తాద్ అప్డేట్ రావడం లేదు.ఈ విషయంపై ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ప్రస్తుతం ఎంత పెద్ద హీరో చిత్రనికైనా పబ్లిసిటీ అనేది కామన్ అయిపోయింది.
కొన్నిచిత్రాలైతే షూటింగ్ దశ నుంచే ఈ సూత్రాన్ని అవలంభించి, తమ సినిమా గురించి ప్రేక్షకులు నిత్యం మాట్లాడుకునేలా చేస్తున్నారు. చిరంజీవి, అనిల్ రావిపూడి ల 'మన శంకర వరప్రసాద్ గారే'(Mana Shankara Vara prasad garu)ఒక ఉదాహరణ. అలాంటిది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అవుతుంది.
Also read: సీరియల్ నటికి వేధింపులు.. నవీన్ అరెస్ట్
మాగ్జిమమ్ షూటింగ్ కంప్లీట్ అవ్వడంతో పాటు కొన్ని సాంగ్స్ ని కూడా చిత్రీకరించారనే టాక్ ఎప్పట్నుంచో వినపడుతుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో లేదో తెలియదు. కానీ కనీసం 70 % షూటింగ్ అయినా కంప్లీట్ అయి ఉంటుంది. కాబట్టి సినిమాకి సంబంధించిన అప్ డేట్ ని ఎప్పటికప్పుడు ఇస్తుండాలని, ఈ విషయం మేకర్స్ కి కూడా తెలియంది కాదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. రిలీజ్ డేట్ విషయంలో కూడా పూర్తి క్లారిటీ ఇవ్వాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల(Sreeleela),రాశిఖన్నా(Raashii Khanna)జంటగా చేస్తుండగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



