Home

»

Latest News

ఊర్వశి Vs AI కంపెనీ.. రూ.7,000 కోట్ల వివాదంలో CEO సంచలన వ్యాఖ్యలు

Sep 29, 2026 8:01PM

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, లాస్‌ ఏంజిల్స్‌కు చెందిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ మధ్య వివాదం మరింత ముదురుతోంది. తన పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించారంటూ ఊర్వశి టీమ్ ఆరోపించింది. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, రూ.7,000 కోట్ల నష్టపరిహారాన్ని కోరుతున్నామని ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఊర్వశి పేరును వ్యాపారంలో ఉపయోగించవద్దని కూడా ఏఐ సంస్థను హెచ్చరించింది.

ఈ వివాదం మధ్యలో బాలీవుడ్.ఏఐ, హాలీవుడ్.ఏఐ సంస్థల ఫౌండర్, సీఈఓ షీరాజ్ హసన్ స్పందించారు. ఇటీవల ఆ సంస్థకు ఇచ్చిన ఓ వైరల్ ఇంటర్వ్యూలో ఊర్వశి ఏఐ, బాలీవుడ్ గురించి కొంత తడబడుతూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై స్పందించిన షీరాజ్ హసన్.. ఊర్వశి చెప్పిన మాటలను తాము బలవంతంగా చెప్పించలేదని స్పష్టం చేశారు. ఏదైనా సమాధానం చెప్పే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భవిష్యత్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్ గురించి తెలుసుకోవాలని ఆమెకు సూచించారు.

అంతేకాదు.. బాలీవుడ్.ఏఐ, హాలీవుడ్.ఏఐ సంస్థలు వినోద పరిశ్రమ భవిష్యత్తుకు ప్రతినిధులుగా నిలుస్తాయని షీరాజ్ హసన్ వ్యాఖ్యానించారు. ఏఐ సినిమాలు, డిజిటల్ స్టార్లు భవిష్యత్తులో వయసు పెరగకుండా, అనేక భాషల్లో మాట్లాడేలా, 24 గంటలూ పనిచేసేలా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఊర్వశి తన సమాధానంతో పోరాడగలరేమో కానీ, రాబోయే భవిష్యత్తుతో పోరాడలేరని, దాన్ని స్వీకరించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం ఊర్వశి టీమ్ ఈ వ్యవహారాన్ని న్యాయపరంగా ముందుకు తీసుకెళ్తున్నట్లు చెబుతుండగా.. మరోవైపు షీరాజ్ హసన్ మాత్రం ఏఐ టెక్నాలజీనే వినోద రంగ భవిష్యత్తు అని గట్టిగా చెబుతున్నారు. దీంతో సెలబ్రిటీల పేరు, ఇమేజ్, కంటెంట్‌ను ఏఐ సంస్థలు ఎలా ఉపయోగించాలి? అనుమతులు, వ్యక్తిగత హక్కులకు సంబంధించిన నిబంధనలు ఏమిటన్న చర్చ కూడా మొదలైంది. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

 

 

Urvashi Rautela, Urvashi Rautela AI controversy, Urvashi Rautela lawsuit, 7000 crore lawsuit, Sheeraz Hasan, Bollywood AI, Hollywood AI, Artificial Intelligence controversy, Urvashi Rautela legal action, AI entertainment industry

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com