
మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ప్రపంచ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. చిరంజీవితో ఒక గ్రాండ్ సెలబ్రిటీ టాక్ షో చేయడానికి చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది అంటున్నారు.
ఇక ఈ షో కోసం నెట్‌ఫ్లిక్స్ ఇస్తున్న రెమ్యునరేషన్ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. చిరంజీవికి ఈ సెలబ్రిటీ టాక్ షో కోసం ఏకంగా రూ. 200 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ స్థాయి ఆఫర్ అని చెప్పుకోవచ్చు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. ఆ షో వెనుక కీలక పాత్ర పోషించిన బి.వి.ఎస్. రవి ఇప్పుడు చిరంజీవి నెట్‌ఫ్లిక్స్ షో కోసం కూడా కాన్సెప్ట్‌ని సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ భారీ డీల్‌కు సంబంధించిన చర్చలన్నింటినీ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల దగ్గరుండి నడిపిస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం చిరంజీవి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి కానుంది. 2027 సంక్రాంతి కానుకగా ‘కాకా’ చిత్రం విడుదల కానుంది.
‘కాకా’ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే, చిరంజీవి ఈ నెట్‌ఫ్లిక్స్ టాక్ షో షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: బాబోయ్ 12 పాటలా.. 'జైలర్ 2' ట్రాక్‌లిస్ట్ వచ్చేసింది.!
[Chiranjeevi Netflix Talk Show, Chiranjeevi Remuneration, Chiranjeevi OTT Talk Show, Chiranjeevi Netflix Deal, Chiranjeevi Talk Show, Chiranjeevi OTT, BVS Ravi, Sushmitha Konidela, Unstoppable with NBK, Telugu Film News]





