తెలుగు నాట ఊర్వశి రౌతేలాకి గుడి!
on Apr 18, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)'డాకుమహారాజ్' సాధించిన ఘన విజయం అందరకి తెలిసిందే. ఈ మూవీ ద్వారా స్పెషల్ సాంగ్స్ లోనే కాదు, నటిగాను సత్తా చాటగలనని నిరూపించుకున్న బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా(Urvashi rautela). 'డాకు మహారాజ్' కంటే ముందు వాల్తేరు వీరయ్య, ఏజెంట్, స్కంద, బ్రో వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో చేసింది. కానీ డాకు మహారాజ్ మాత్రం 'ఊర్వశి రౌతేలా' ని సరికొత్తగా ప్రెజెంట్ చేసి పాన్ ఇండియా లెవల్లో ఆమె సినీ కెరీర్ కి సరికొత్త జోష్ ని తీసుకొచ్చింది.
రీసెంట్ గా ఊర్వశి రౌతేలా ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతు 'ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో నా పేరుపై ఒక ఆలయం ఉంది. మీరు ఎవరైనా అక్కడికి వెళ్తే నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ విశ్వ విద్యాలయంలోను నన్ను' దండమమాయి' పేరుతో పిలుస్తు నా ఫోటోకి పూలమాలలు వేస్తారు. నాకు కూడా మొదట్లో ఈ విషయం తెలియదు. కానీ ఆ తర్వాత తెలిసి ఆశ్చర్యపోయాను. దీనిపై వార్తా కథనాలు కూడా వచ్చాయి. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాను. అక్కడ కూడా నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. దక్షిణ భారత దేశంలో నాకు రెండో ఆలయాన్ని కట్టాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
2003 లో సన్నీడియోల్ హీరోగా వచ్చిన 'సింగ్ సాబ్ ది గ్రేట్' తో తెరంగ్రేటం చేసిన ఊర్వశి రౌతేలా ఇప్పటి వరకు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో కలిపి సుమారు 19 సినిమాల దాకా చేసింది. వీటిల్లో ఎక్కువ భాగం స్పెషల్ సాంగ్సే. ఈ నెల 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన' జాట్' మూవీలోని 'టచ్ కియా' సాంగ్ లో కూడా ఊర్వశి అద్భుతంగా చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
