Home

»

Latest News

బాబూ మహేష్.. ఎంటయ్యా ఇది ?!

Jul 8, 2016 5:30PM


"బ్రహ్మోత్సవం" సినిమా ఫ్లాపని సాక్ష్యాత్తూ మహేష్ బాబు ఫ్యాన్సే స్వయంగా ఒప్పుకోవడంతోపాటు.. ట్విట్టర్ లో స్టేట్ మెంట్లు సైతం ఇచ్చేశారు. కమర్షియల్ ఫ్లాప్ మాత్రమే కాకుండా భారీ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచిన "బ్రహ్మోత్సవం" చిత్రాన్ని దాదాపుగా మొదటివారంలోనే థియేటర్ల నుంచి తీసేశారు. మహేష్ బాబు కూడా సినిమా విడుదలయ్యాక దాదాపుగా మౌనవ్రతం వహించాడు. సినిమా గురించి ఒక్క మాట కాదు కదా కనీసం ఒక్క ట్వీటు కూడా పెట్టలేదు మహేష్. 
అలాంటి సినిమా నేటితో విజయవాడలో 50 రోజులు పూర్తి చేసుకొంది. అసలు ఒక్కసారి చూడడానికే ప్రేక్షకులు నీరుగారిపోయిన ఈ సినిమాను 50 రోజులపాటు మహేష్ వీరాభిమానులు సైతం చూడలేరు. అలాంటప్పుడు "బ్రహ్మోత్సవం" 50 రోజులు ఎలా ఆడుతుంది? అనే ప్రశ్న అందరి బుర్రను బద్దలు కొడుతుంది. కేవలం రికార్డ్ కోసమే మహేష్ బాబు అభిమానులో లేక నిర్మాతలో ఈ పని చేశారని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. మహేష్ లాంటి సూపర్ స్టార్ హీరో ఇమేజ్ కు ఈ తరహా పబ్లిసిటీ మరింత కీడు చేకూర్చడం మినహా మరో ఉపయోగం లేదు. ఈ విషయాన్ని మహేష్ బాబు గ్రహిస్తే మంచిది!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com