
రామ్ కు రాకరాక వచ్చిన హిట్ "నేను శైలజ" కాన్సెప్ట్, కథనం పాతదే అయినప్పటికీ.. డీలింగ్ ఫ్రెష్ గా ఉండడంతో సూపర్ హిట్ అయిపోయింది. అప్పట్నుంచి హీరో రామ్ ఆ మూడ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నప్పటికీ.. ఇంకా "నేను శైలజ"ను పట్టుకొనే వేలాడుతున్నాడు. "నేను శైలజ" సినిమాలోని "క్రేజీ ఫీలింగ్" అనే పాట వీడియోకి యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ వచ్చాయంట. అంటే ఈ పాటను అక్షరాలా కోటి మంది చూశారన్నమాట. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేసి తెగ సంతోషపడిపోతున్నాడు రామ్ బాబు.
"నేను శైలజ" సినిమాను కూడా అంతమంది చూసి ఉండరు. కానీ.. యూట్యూబ్ లో ఫ్రీగా ప్లే అయ్యే వీడియో సాంగ్ ను కోటి మంది చూసినందుకు మాత్రం తెగ సంబరపడిపోతున్నాడు. రామయ్యా ఇకనైనా "శైలజ"ను వదిలిపెట్టి.. నెక్స్ట్ సినిమాతో హిట్ హిట్ కొట్టే పనిలో పడవయ్యా!
.jpg)





.jpg)
