'అన్ స్టాపబుల్' బాలయ్య.. నవంబర్ 4 నుండి షురూ!
on Oct 14, 2021
.jpg)
నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు. 'unstoppable with nbk' పేరుతో రానున్న ఈ షోకి సంబంధించిన అధికారిక ప్రకటన కార్యక్రమం నేడు(గురువారం) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ, అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
హైదరాబాద్ లోని నోవోటెల్ లో జరిగిన ఈ కార్యక్రమం.. సింగర్ సింహ టీమ్ పాడిన బాలకృష్ణ స్పెషల్ సాంగ్స్ తో ప్రారంభమైంది. ఆ తరువాత అల్లు అరవింద్ ఏవీ ప్లే చేయబోతుండగా.. ఆయన ఇప్పుడు తన ఏవీ వద్దని, బాలకృష్ణ ఎంట్రీ కోసం అందరం ఆసక్తిగా చూస్తున్నామని చెప్పడంతో.. 'పైసా వసూల్' టైటిల్ సాంగ్ తో బాలకృష్ణ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తనదైన స్టెప్పులతో బాలయ్య అలరించారు. ఆ తర్వాత 'unstoppable with nbk' షో ప్రోమో ప్లే అయింది. ఆ ప్రోమోలో బాలయ్య లుక్ ఆకట్టుకుంది. కళ్ళజోడు స్టైల్ గా పెట్టుకొని 'కలుద్దాం.. ఆహాలో' అంటూ బాలయ్య మెప్పించారు. ఈ షో నవంబర్ 4 నుండి ఆహాలో టెలికాస్ట్ కానుందని ప్రోమోలో తెలిపారు.
అనంతరం బాలయ్య మాట్లాడుతూ.. తమకి, అల్లు కుటుంబానికి మొదటి నుండి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. అప్పట్లో నాన్న గారు ఎన్టీఆర్ తో చనువుగా ఉండే ఒకే ఒక వ్యక్తి అల్లు రామలింగయ్య గారని తెలిపారు. అలాగే ఈ షో ప్రోమోని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసినట్లు బాలయ్య చెప్పారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. బాలకృష్ణ తెర మీద గొప్ప నటుడు కానీ బయట మాత్రం అసలు నటించరు. కోపమొస్తే కోపం, సంతోషమొస్తే సంతోషం నటించకుండా చూపించే మనస్తత్వం. అలా రియల్ ఎమోషన్స్ చూపించే మనిషి ఈ టాక్ షో చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. బాలకృష్ణతో టాక్ షో చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను స్టాఫ్ తో చెప్పగానే అందరూ చాలా బాగుంటుందని ఎక్సైట్ అయ్యారని అరవింద్ తెలిపారు. ఈ షోతో పాటు బాలకృష్ణ నటిస్తున్న 'అఖండ' సినిమా కూడా ఘన విజయం సాధించాలని కాంక్షిస్తూ బాలయ్యకి అరవింద్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



