కాల భైరవ.. ఒకే రోజు రెండు చిత్రాలు!
on Jun 16, 2022

స్వరవాణి కీరవాణి వారసుడిగా తెలుగునాట స్వరంగేట్రం చేశాడు కాల భైరవ. ఒకవైపు గాయకుడిగా తనదైన ముద్ర వేస్తూనే.. మరోవైపు సంగీత దర్శకుడిగానూ అలరిస్తున్నాడీ మల్టిటాలెంటెడ్. ఇప్పటికే `మత్తు వదలరా`, `కలర్ ఫొటో`, `తెల్లవారితే గురువారం`, `ఆకాశవాణి`, `లక్ష్య`, `బ్లడీ మేరీ`తో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంప్రెస్ చేసిన కాల భైరవ.. త్వరలో మూడు చిత్రాలతో ఎంటర్టైన్ చేయనున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా జూలైలో రిలీజ్ కానుండగా.. వాటిలో రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలకు సిద్ధమయ్యాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `మత్తు వదలరా` ఫేమ్ రితేశ్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారిణిగా నటించిన సినిమా `హ్యాపీ బర్త్ డే`. కాల భైరవ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం.. జూలై 15న తెరపైకి రానుంది. కట్ చేస్తే.. అదే రోజున సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్ డైరెక్ట్ చేసిన `గుర్తుందా శీతాకాలం` కూడా విడుదల కానుంది. మరి.. ఒకే రోజున రాబోతున్న ఈ చిత్ర ద్వయాలతో కాల భైరవ ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి. అన్నట్లు.. అదే జూలై నెలలో 22వ తేదిన కాల భైరవ బాణీలు కట్టిన `కార్తికేయ 2` వస్తోంది. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా చందు మొండేటి ఈ మిస్టరీ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



