ఆ డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు
on Mar 11, 2016

వరస పరాజయాలు వస్తే డిలా పడిపోవడం సహజం. కానీ సత్తా ఉన్నవాళ్లు ఎప్పటికైనా పుంజుకోగలరని ప్రూవ్ చేశాడు ఆ దర్శకుడు. రిలీజ్ కు ముందు తన స్థాయి సినిమాలు ఇప్పటి వరకు తీయలేదని మొహమాటం లేకుండా చెప్పిన ఆ డైరెక్టర్ ఇప్పుడు తనను తాను నిరూపించుకున్నాడు. అవడానికి రీమేక్ సినిమా అయినా, ప్రేక్షకులను థియేటర్ కు రప్పించడంలో సక్సెస్ అవడమే కాదు, సినిమాను కూడా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.

భవిష్యత్తులో టాలీవుడ్ స్థాయి పెంచే సినిమాలు చేస్తానన్న కుమార్ నాగేంద్ర, ఆ మాటలు నిజమే అనేలా తుంటరిని తెరకెక్కించాడు. ముందే తెలిసిపోయిన స్టోరీ కావడంతో, రీమేక్ సినిమాల్లో పెద్దగా కిక్కు ఉండదు. కానీ కుమార్ దీన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్ది శభాష్ అనిపించుకున్నాడు. గుండెల్లో గోదారితో, విషయం ఉంది అనిపించుకున్నా జోరుతో మాత్రం కంప్లీట్ గా డౌన్ అయిపోయాడు నాగేంద్ర. దీంతో ఇప్పుడు తుంటరిని రీమేక్ అయినా సరే సొంతకథలా కసిగా తెరకెక్కించాడు. ఇప్పుడు వస్తున్న టాక్ బట్టి చూస్తే, కుమార్ నాగేంద్రకు మరిన్ని మంచి అవకాశాలు లైన్ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



