తుంటరి రిలీజ్ టాక్
on Mar 11, 2016
.jpg)
ఈ వారం చిన్న సినిమాల మధ్యలో, పెద్ద చిన్న సినిమాగా వచ్చింది తుంటరి. హిట్ కొట్టాలన్న కసితో కుమార్ నాగేంద్ర, నారా రోహిత్ టీం అప్ అయి చేసిన సినిమా ఇది. మరి తుంటరి ఫస్ట్ టాక్ ఎలా ఉందో చూడండి.
అన్నీ ఆఫ్ బీట్ సినిమాల్లా ఉండటంతో, తుంటరికే ఆడియన్స్ లైన్ కడుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా, థియేటర్లు జనాలతో కళకళలాడుతున్నాయి. ఓపెనింగ్స్ చాలా బాగున్నాయి. ఇదే స్థాయిలో రెండు వారాల పాటు ఆడిందంటే, తమిళ ఒరిజినల్ స్థాయిలో వసూళ్లు రాబట్టే అవకాశం పుష్కలంగా ఉంది. సినిమాలో ఓపెనింగ్ సీన్స్ అదిరాయి. సినిమాకు సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ హైలెట్. ఫస్ట్ టాక్ పాజిటివ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగిపోతుంది. ఓవరాల్ గా డైరెక్టర్ గా తన సత్తా చూపించాడు కుమార్ నాగేంద్ర. మిగిలిన సినిమాలతో పోలిస్తే, తుంటరి ఫుల్ ఫన్ ఇచ్చిందంటున్నారు ఫస్ట్ ఆట ఆడియన్స్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



