Home

»

Latest News

సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ 50% పూర్తి

Mar 28, 2011 3:40PM

sumanth ashwin wallpapers, sumanth ashwin stills,sumanth ashwin images, sumanth ashwin pics, sumanth ashwin photos, sumanth ashwin picturesసుమంత్ అశ్విన్ న్యూ మూవీకి "తూనీగ తూనీగ" అన్న పేరుని నిర్ణయించారని తెలిసింది. యమ్ యస్ రాజు దర్శకత్వంలో, సుమంత్ ఆర్ట్స్ పతాకంపై, తన కుమారుడు సుమంత్ ఆశ్విన్ ని హీరోగా పరిచయం చేస్తూ, మంతెన రామ్ జీ నిర్మిస్తున్న న్యూ మూవీకి "తూనీగ తూనీగ". ఈ చిత్రం ఇప్పటికి యాభై శాతం పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ ని, స్క్రీన్ ప్లే ని ప్రముఖ దర్శకుడు వి.యన్.ఆదిత్య నిర్వహించినట్లు ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో కన్నడంలో సూపర్ హిట్టయిన "ముంగారు మళై" అనే చిత్రాన్ని తెలుగులో "వాన" అని నిర్మించగా, ఆ చిత్రానికి యమ్ యస్ రాజు తొలిసారి దర్శకత్వం వహించారు.


"వాన"చిత్రం ఆడియో సూపర్ హిట్టయినా చిత్రం ఫ్లాప్ చిత్రంగా మిగిలింది. తన కుమారుడు హీరోగా పరిచయం అవుతున్న ఈ "తూనీగ తూనీగ" చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తూ, మరోసారి దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు యమ్ యస్ రాజు. దర్శకుడిగా తన భవిష్యత్తే కాకుండా హీరోగా తన కొడుకు సుమంత్ ఆశ్విన్ భవిష్యత్తు కూడా ఈ "తూనీగ తూనీగ" చిత్రంతో ముడిపడి ఉండటం విశేషం. ఈ చిత్రం ద్వారా ఇద్దరు హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com