Home

»

Latest News

యన్ టి ఆర్ సెల్ కోన్ మొబైల్ లాంచ్

Mar 28, 2011 4:32PM

 

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures

యన్ టి ఆర్ సెల్ కోన్ మొబైల్ లాంచ్ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సెల్ కోన్ మొబైల్ కంపెనీ వారు తమ కంపెనీ మొబైల్ ని యంగ్ టైగర్ యన్ టి ఆర్ చేత ఆవిష్కరింపజేయటానికి పఠాన్ చెరువులో షూటింగ్ చేస్తున్న యన్ టి ఆర్ ని అడిగారు. అందుకు అంగీకరించిన యంగ్ టైగర్ యన్ టి ఆర్ పఠాన్ చెరువులో ఉన్న విజయ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లో సెల్ కోన్ మొబైల్ ను సాయంత్రం అయిదు గంటలకు మార్చ్ 28 వ తేదీన, లాంచ్ చేయనున్నారని తెలిసింది. పఠాన్ చెరువు వద్ద సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో, తమన్నా హీరోయిన్ గా, బి.వి.యస్.యన్.నిర్మిస్తున్న చిత్రంలో యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం షుటింగ్ గత కొన్ని రోజులుగా జరుగుతూంది.


అందుకనే సెల్ కోన్ మొబైల్ కంపెనీ వారు తమ కంపెనీ మొబైల్ ని యంగ్ టైగర్ యన్ టి ఆర్ చేత ఆవిష్కరింపజేయటానికి యన్ టి ఆర్ ని కోరగానే ఆయన అంగీకరించినట్లు సమాచారం. యన్‍ టి ఆర్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అశ్వనీ దత్ నిర్మిస్తున్న"శక్తి" చిత్రం ఏప్రెల్ ఒకటవ తేదీ, అంటే ఆల్ ఫూల్స్ డే రోజున ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రింట్లతో విడుదల చేయబడుతుంది. ఈ "శక్తి" చిత్రం తెలుగు సినీ చరిత్రలో రికార్డులు తిరగరాస్తుందని యన్ టి ఆర్ అభిమానులు ఆశిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com