పవన్ కొడుకు అకిర నందన్ టేస్ట్‌కి త్రివిక్రమ్ స్టైల్ కుదురుతుందా!
on Dec 28, 2022

వాస్తవంగా ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. కానీ వారి కంటే కేవలం తెలుగు రాష్ట్రాలు, తెలుగు మార్కెట్టును మాత్రమే దృష్టిలో పెట్టుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్లను మించిన క్రేజీ ఉంది. అది ఎలా సాధ్యమో చాలామందికి అర్థం కాదు. అదే పవన్ అంటే... పవర్ స్టార్ అంటే అదొక సునామి. ఆయన కోసం అభిమానులు పడి చచ్చిపోతారు. ఆయన పేరు వింటేనే తెలుగు ప్రజలు ఊగిపోతారు. ఆయన మాట్లాడటం వినిపిస్తే చాలు వాతావరణ మొత్తం వేడెక్కిపోతుంది.. అలాంటి క్రేజ్ ఉన్న స్టార్ సౌత్ ఇండియాలో మరొక లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి స్టార్ కి సంబంధించిన ఏ చిన్న విషయం సోషల్ మీడియాలో వచ్చిన నిమిషాల వ్యవధిలో వైరల్ అయిపోతుంది. గుడ్ న్యూస్ అయితే పండగ చేసుకుంటారు. బ్యాడ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో నిరసనలతో హోరెత్తిస్తారు. అలాంటి క్రేజ్ ఉన్న హీరో కొడుకు సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఇక మేనియా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.
మొదటి రోజు ఓపెనింగ్స్ స్టార్ హీరోలను మించిన రేంజ్ లో ఉంటాయి. పైగా పవన్ కుమారుడు అకీరానందన్ చూడటానికి హాలీవుడ్ హీరో లాగా భారీ కటౌట్ తో ఉంటాడు. చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. అతని వర్కౌట్స్‌కి సంబంధించిన వీడియోస్... అలాగే కర్ర సాముకి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అకిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అని అడిగిన ప్రతిసారి రేణు దేశాయ్ అకిరాకి మ్యూజిక్ అంటేనే ఇష్టం. యాక్టింగ్ మీద ఆసక్తి లేదు... అని చెప్పుకుంటూ వచ్చింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అఖీరానందన్ మొదటి సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కాబోతుందని సమాచారం. ఇందుకోసం పవన్ ఒక కథను కూడా ప్రముఖ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ తో సిద్ధం చేయించాడు అని తెలుస్తోంది. అతను మరెవరో కాదు పవన్ కళ్యాణ్ కు బెస్ట్ ఫ్రెండ్ అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు మంచి స్నేహబంధం ఉంది. సినిమాలకు మించిన వ్యక్తిగత అనుబంధం వారిది.
త్రివిక్రమ్ తో కలిసి పవన్ ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అయినా రెండు సూపర్‌హిట్స్ ఇచ్చిన ఒక్క డిజాస్టర్ వచ్చిందంటే ఇక ఆ దర్శకుడిపై ఆ స్టార్ హీరో అభిమానులు ద్వేషం పెంచుకుంటారు. ఆయన తీసిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్. కాగా దానికి తోడు ఈ సినిమాని ఆయన ఓ ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టడం అనేది అభిమానులకు మింగుడు పడలేదు. దాంతో ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పీడకలగా భావిస్తారు. ఇప్పటికీ వారు త్రివిక్రమ్ అంటేనే మండిపడుతున్నారు. మరి అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అకిరా నందన్ మొదటి సినిమాకి దర్శకుడు అంటే ఫ్యాన్స్ సంతోషంగా స్వీకరించలేకపోతున్నారు. మరోసారి నమ్మి మోసపోవద్దు అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి హెచ్చరిస్తున్నారు. ఫ్యాన్స్ గతంలో అకీరానందన్‌ను మీకిష్టమైన హీరో ఎవరు అంటే మెగా కాంపౌండ్ లోని ఎవరి పేరు చెప్పకుండా యంగ్ టాలెంటెడ్ హీరో అయినా అడివి శేష్ పేరు చెప్పారు. దాన్నిబట్టి అకిర టెస్ట్ ఏమిటో అర్థం అవుతుంది. మరి అకిర నందన్ టేస్ట్ కి త్రివిక్రమ్ స్టైల్ కి ఏమైనా పొంతన కుదురుతుందా అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. మరి అకిర నందన్ మొదటి సినిమా ఎవరితో, ఎప్పుడు ఉంటుందనే విషయంలో అధికారికంగా తెలియాల్సి వుంది. ప్రస్తుతానికి ఈ రకమైన వార్తలు వస్తున్నప్పటికీ వాస్తవాలు తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



