మాంత్రికుల వారి తర్వాతి సినిమా పవన్ తో..?
on Jun 4, 2016
త్రివిక్రమ్ అ ఆ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నిర్మాత రాధాకృష్ణతో మాటల మాంత్రికుల వారి కాంబో మంచి హిట్టైంది. వరసగా జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ లతో హ్యాట్రిక్ కొట్టేశారు. ఇద్దరికీ మంచి ర్యాపో ఉండటం కూడా బాగా కలిసొచ్చింది. ఇప్పటికే త్రివిక్రమ్ తో ఎన్ని వీలైతే అన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నానంటూ నిర్మాత రాథాకృష్ణ క్లియర్ గా చెప్పేశారు కూడా. తాజాగా ఆయన బ్యానర్లోనే త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు సినీజనాలు. పవన్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే అయినా, ఎవరి బ్యానర్లో చేస్తాడన్నదే ఇక్కడ ప్రశ్న. దాసరి నిర్మాణంలో పవన్ ఒక సినిమా చేయాల్సి ఉండగా, దాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడని ప్రచారం జరిగింది. సడెన్ గా సీన్ లోకి రాధాకృష్ణ రావడంతో, ఇప్పుడు త్రివిక్రమ్ ఎవరికి ఓటేస్తాడు అన్నది ఆసక్తికరం. ఒక్కటి మాత్రం కన్ఫామ్. పవన్ త్రివిక్రమ్ కాంబో ట్రాక్ రికార్డ్ బట్టి, మరో భారీ హిట్ ను వీళ్లిద్దరి నుంచి ఎక్స్ పెక్ట్ చేయచ్చు.