ఇదేం వెరైటీ డ్రెస్ పాపలూ..?
on Jun 4, 2016
ఈ మధ్య మన హీరోయిన్స్ కొత్త ఫ్యాషన్లను ఫాలో అవుతున్నారు. సమంత, కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ ఇలా హీరోయిన్స్ అందరూ చిత్ర విచిత్రమైన డ్రస్సులేసుకుని తమకున్న ఫ్యాషన్ సెన్స్ ను అందరికీ తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ప్రణీత వేసిన ఈ డ్రస్ చూడండి. సైమా ఈవెంట్ కు ఈ డ్రస్ వేసుకొచ్చిందీ భామ. అయితే ఈ గెటప్ చూసి, జనాలు తెగ నవ్వుకుంటున్నారు. చూడగానే మరీ డిఫరెంట్ గా ఉండటమే అందుక్కారణం. కొంత మందైతే దీనికి బటర్ ఫ్లై డ్రస్ అని కూడా పేరు పెట్టేస్తున్నారు.
ఆమెతో పాటు ఈ ఈవెంట్ కు హాజరైన హ్యూమా ఖురేషీ, ప్రగ్యా జైస్వాల్, అమైరా దస్తర్ లు కూడా తమ ఫ్యాషన్ సెన్స్ ను చూపించే ప్రయత్నం చేశారు. ప్రగ్యా జైస్వాల్ కూడా వెరైటీగానే ట్రై చేసింది కానీ, అందరిలోకీ వెరైటీ డ్రెస్ మాత్రం ప్రణీతదే. పోన్లే..ఈ డ్రస్సైనా ఈ కన్నడ భామకు సోలో హీరోయిన్ గా ఛాన్స్ తీసుకొస్తే మంచిదే మరి.