మహేష్ బాబు మళ్లీ పోలీసేనట..!
on Jun 4, 2016
మురుగదాస్ తో మహేష్ సినిమా ఎలా ఉండబోతోంది. ఏ కాన్సెప్ట్ లో సూపర్ స్టార్ ను మురుగ చూపిస్తాడు..ఇవే మహేష్ అభిమానుల మదిలో ఉన్న ప్రశ్నలు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ అయిన నేపథ్యంలో, తమ హీరో ఇండస్ట్రీ హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వాలనేది అభిమానుల కోరిక. ఈ సినిమాలో మహేష్ ఇంటిలెజన్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడంటున్నాయి సినీ వర్గాలు. సెంట్రల్ గవర్నమెంట్ కింద స్పెషల్ పవర్స్ తో పనిచేసే ఆఫీసర్ గా మహేష్ కనిపిస్తాడట. చూడబోతే తుపాకీ తరహాలో ఇంటెలిజెంట్ ఫిలింలా అనిపిస్తోంది మరి. టెక్నికల్ గా హై రేంజ్ లో సినిమాను మురుగ తెరకెక్కించానుకుంటున్నాడట. అంతర్లీనంగా సినిమాలో మెసేజ్ కూడా ఇస్తాడట. ప్రస్తుతం మురుగ అండ్ కో, సినిమా ప్రీప్రొడక్షన్ ప్లానింగ్ లో బిజీగా ఉన్నారు. తమిళంలో విజయ్ కి మరిచిపోలేని హిట్స్ ఇచ్చిన మురుగ, తమ హీరోకు కూడా అలాంటి భారీ హిట్ ఇస్తాడని ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆగష్ట్ మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది. మహేష్ సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా నటిస్తుండటం విశేషం.