ENGLISH | TELUGU  

త్రిష ఇచ్చిన ట్విస్ట్‌కి షాక్‌ అవుతున్న నెటిజన్లు.. అసలేం జరిగింది?

on Mar 29, 2025

1999లో నటిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన త్రిష దాదాపు 15 సంవత్సరాలపాటు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 70కిపైగా సినిమాల్లో నటించింది. 26 సంవత్సరాలుగా తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్న త్రిష నటిస్తున్న 5 సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. కెరీర్‌పరంగా ఎన్నో సక్సెస్‌లు చూసిన త్రిష వయసు 41 సంవత్సరాలు. కానీ, ఇప్పటికీ సింగిల్‌గానే కొనసాగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తన మొదటి సినిమాలో ఎలాంటి ఫిజిక్‌తో కనిపించిందో ఇప్పటికీ దాన్నే మెయిన్‌టెయిన్‌ చేస్తూ కొత్త హీరోయిన్లకు కూడా అసూయ పుట్టిస్తోంది. ప్రస్తుతం తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ హీరోయిన్‌గానే కొనసాగుతున్న త్రిష.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందర్నీ అంతగా షాక్‌కి గురిచేసిన ఆ పోస్ట్‌ ఏమిటంటే..

LOVE ALWAYS WINS అని క్యాప్షన్‌ పెట్టడంతో పాటు ఒక అందమైన ఫోటో కూడా షేర్‌ చేసింది త్రిష. సాంప్రదాయమైన చీరకట్టుతోపాటు అందమైన జ్యూయలరీతో మరింత అందంగా కనిపిస్తున్న త్రిష ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది అనే క్యాప్షన్‌ చూసిన తర్వాత సోషల్‌ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రిష పెళ్లి చేసుకోబోతోందా.. అందుకే ఈ పోస్ట్‌ పెట్టిందా అనే టాపిక్‌ ఇప్పుడు చర్చకు వచ్చింది. ఆమె పెట్టిన ఒక్క పోస్ట్‌తో రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు నెటిజన్లు. త్రిష ఎవరినైనా ప్రేమించిందా.. తమ ప్రేమ గెలిచిన నేపథ్యంలో ఈ క్యాప్షన్‌ పెట్టిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా త్రిష పెళ్లి చేసుకోబోతోంది అంటూ చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే అవి గాసిప్స్‌గానే మిగిలిపోయాయి. ప్రభాస్‌, అనుష్క, త్రిష.. ఇలా ఈ ముగ్గురూ పెళ్లికి సంబంధించిన వార్తలతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటారు. చివరికి ఆ వార్తలో నిజం లేదంటూ సైలెంట్‌ అయిపోతారు.

LOVE ALWAYS WINS అనే క్యాప్షన్‌తో త్రిష పెట్టిన పోస్ట్‌తో ఇప్పుడు అందరూ ఆలోచనలో పడ్డారు. త్రిష పెళ్లికి సిద్ధమవుతోందని కొందరు, ఇన్నాళ్ళకు ప్రేమాయణానికి శ్రీకారం చుడుతోందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇది ఏదో సినిమా ప్రమోషన్‌ కోసం పెట్టిన పోస్ట్‌ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలికాలంలో కొందరు సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్‌ కోసం ఇలాంటి పోస్టులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్యాప్షన్‌ వెనక ఉన్న సీక్రెట్‌ ఏమిటి అనేది త్వరలోనే బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల త్రిష నటించిన లియో, విదాముయర్చి, ది గోట్‌, ఐడెంటిటీ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన త్రిష.. త్వరలోనే అజిత్‌ హీరోగా నటిస్తున్న గుడ్‌ బ్యాడ్‌ అగ్లి చిత్రంతో రాబోతోంది. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రంలో కూడా నటిస్తోంది. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.