Home

»

Latest News

Trisha: త్రిష రీసెంట్ పోస్ట్ వైరల్.. విజయ్ తో బంధంపై వివరంగా క్లారిటీ ఇచ్చేసింది 

May 9, 2026 11:15AM

 

-వైరల్ గా మారిన త్రిష పోస్ట్ 
-విజయ్ తో నిజంగానే ఎఫైర్ ఉందా!
-మరి తాజా పోస్ట్ లోని ఆంతర్యం ఏంటి


సోషల్ మీడియాలో ఎంతటి వైరల్ న్యూస్ అయినా రెస్ట్ తీసుకొని ఒక మూలన కూర్చుంటుంది. కానీ విజయ్, త్రిష మధ్య ఎఫైర్ ఉందనే రూమర్ న్యూస్ మాత్రం రెస్ట్ అనేదే లేకుండా వ్యూస్ కి రెస్ట్ లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో త్రిష రీసెంట్ గా  చేసిన పోస్ట్ తో అయినా ఎఫైర్ రూమర్స్ ఆగుతాయో చూడాలి. మరి ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం.

త్రిష రీసెంట్ గా తన ఇనిస్టా లో ఎఫైర్ వార్తలని ఉద్దేశించి  ఒక కార్టూన్ బొమ్మతో  పాటు "Blah Blah Blah" (చెత్త మాటలు) ,IYKYK (If You Know You Know) అనే అక్షరాలని ట్యాగ్ లైన్‌ గా జోడించింది. 'బయట వాళ్లు ఏమనుకున్నా పర్వాలేదు, అసలు విషయం తెలిసిన వారికి తెలుసు" అనే అర్థం వచ్చేలా చేసిన  పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తనపై వస్తున్న అసత్య ప్రచారాలని లేదా అతిగా మాట్లాడుతున్న వారి మాత్ లని ఆపాలనే త్రిష ఆ విధంగా పోస్ట్ చేసిందని  విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read:sathi leelavathi: సతీలీలావతి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!.. మెగాకోడలు సేఫ్ జోన్ లోకి వెళ్తుందా!

విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. 'గిల్లి' సినిమా నుండి 'లియో' వరకు వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఫేవరెట్. అయితే, వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లని  "Blah Blah" అంటూ త్రిష  కొట్టిపారేయడం ఆమెలోని ధైర్యాన్ని చూపిస్తోంది. ఇక విజయ్  తో  ముఖ్యమంత్రి పీఠం దోబూచులాడుతోంది. వేరే రాజకీయ పార్టీల కంటే విజయ్ టివికె కి ఎక్కువ సీట్స్ వచ్చినా ప్రభుత్వాన్ని స్థాపించే సింగల్ మెజారిటీ రాకపోవడమే అందుకు కారణం. 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com