Home

»

Latest News

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్!

May 09, 2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కళా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తికి ఈ బాధ్యతలు అప్పగించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి, టీవీ రంగ విస్తరణ, అంతరించిపోతున్న నాటకరంగ పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మూడు విభాగాలను సమన్వయం చేస్తూ, రాష్ట్రంలో షూటింగ్ సంస్కృతిని పెంచడం, కళాకారులకు సరైన వేదికను కల్పించడం భరత్ భూషణ్ ముందున్న ప్రధాన లక్ష్యాలు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com