Home

»

Latest News

sathi leelavathi: సతీలీలావతి ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్!.. మెగాకోడలు సేఫ్ జోన్ లోకి వెళ్తుందా!

May 09, 2026

 


మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొంత గ్యాప్ తర్వాత సెల్యులాయిడ్ పై అడుగుపెట్టిన మూవీ సతీలీలావతి. నిన్న రిలీజ్ అవ్వగా దేవ్ మోహన్ లావణ్యకి జత కట్టాడు. హీరోతో హీరోయిన్ కదా జత కట్టేది అని  అనుకోవచ్చు. కానీ సతి లీలావతి కథ ప్రకారం హీరోయిన్ తో  హీరో జత కట్టాడని అనుకోవడంలో ఎలాంటి అక్షర దోషం లేదు. మరి ఈ చిత్రం మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ఏంటో చూద్దాం.

తొలి రోజు సుమారు 20 లక్షల గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సతీ లీలావతికి 10  కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాల టాక్. మరి 20 లక్షలు రాబట్టడం అంటే యూనిట్ కి షాక్ అని చెప్పవచ్చు.  దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ నిర్మించగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. భీమిలి కబడీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకుడు కాగా  మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు. నరేష్, మడోన్నా సెబాస్టియన్, వీటీవీ నరేష్, సప్తగిరి, మోట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిఖ్, తాగుబోతు రమేష్, జోషి తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించారు.

also read:  Peddi: పుష్ప 2 దారిలో పెద్ది 

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com