వెంట వెంటనే వస్తున్న త్రిష.. గట్టిగానే కొట్టేస్తుందా?
on Sep 13, 2023

ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న సీనియర్ హీరోయిన్స్ లో చెన్నై పొన్ను త్రిష ఒకరు. తమిళ, మలయాళ భాషల్లో కలుపుకుని ఈ టాలెంటెడ్ బ్యూటీ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయి. వీటిలో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా.. మరో నాలుగు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటితో పాటు ఇంకో రెండు మూవీస్ అగ్రిమెంట్ దశలో ఉన్నాయని సమాచారం.
ఇదిలా ఉంటే, అక్టోబర్ నెలలో త్రిష డబుల్ ధమాకా ఇవ్వనుంది. కేవలం 13 రోజుల వ్యవధిలో ఈ స్టార్ బ్యూటీ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ రెండు మూవీస్ కూడా తమిళ చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటి.. ది రోడ్ కాగా, మరొకటి లియో. అరుణ్ వశీగరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది రోడ్ అక్టోబర్ 6న విడుదలకు సిద్ధమవుతుండగా.. దళపతి విజయ్ కి జంటగా త్రిష నటించిన లియో అక్టోబర్ 19న రాబోతోంది. మరి.. వీటితో త్రిష బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



