వావ్... మణిరత్నంతో రామ్‌చరణ్
on Sep 13, 2016

టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఇది. మణిరత్నం దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా ఓ చిత్రం రాబోతోంది. అందుకు తగిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈమధ్యే మణిరత్నం రామ్ చరణ్‌ని కలుసుకొని ఓ కథ కూడా వినిపించారని టాక్. దానికి చరణ్ ఓకే చెప్పేయడంతో త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. తెలుగు లో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించని మణి.. ఈమధ్య ఎందుకనో టాలీవుడ్ హీరోల కోసం కథలు రెడీ చేసుకోవడం మొదలెట్టారు. ఆమధ్య మహేష్‌కి ఓ కథ చెప్పారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు చరణ్ తో ఓకే చేయించుకొన్నాడు. చరణ్ ప్రస్తుతం ధృవ షూటింగ్‌లో ఉన్నాడు. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఆతరవాత సుకుమార్ సినిమా మొదలవుతుంది. మరి మణిరత్నంకి చరణ్ డేట్లు ఎప్పుడు ఇచ్చాడో?? దిగ్గజ దర్శకుడితో చరణ్ సినిమా అనేసరికి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే... మణి ఫామ్ కోల్పోయి చాలా కాలమైంది. అదొక్కటే కాస్త ఆందోళన కలిగిందచే విషయం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



