ద్విభాషా చిత్రాలే ముద్దంటున్నారు!
on Feb 16, 2023

మన హీరోలంతా పాన్ ఇండియా సినిమాలను అంటున్నారు.కానీ కూల్ గా కోలీవుడ్ స్టార్స్ మాత్రం ద్వి భాషా చిత్రాలంటూ తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. తెలుగులో పెద్దగా ఆడకపోయినా ఈ చిత్రాలు తమిళంలో మంచి విజయాలు సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. లాభాల పంట పండిస్తున్నాయి. దాంతో మన బిగ్ ప్రొడక్షన్ హౌస్ లు, డైరెక్టర్లు, నిర్మాతలు తమిళ హీరోల వైపు దృష్టి సారిస్తున్నారు. తెలుగులో పెద్దగా ఆడకపోయినా తమిళంలో వారికి బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇటీవల ఏషియన్ ఫిలిమ్స్ సంస్థ శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కేవీ డైరెక్షన్‌లో ప్రిన్స్ అనే ద్విభాష చిత్రం చేశారు. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ తమిళంలో మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా దాదాపు 20 కోట్ల వరకు టేబుల్స్ ప్రాఫిట్ ను అందించిందని సమాచారం. ఇక స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇలయ దళపతి విజయ్‌తో వారిసు మూవీ నిర్మించారు. తెలుగులో వారసుడు పెద్దగా ప్రభావించలేదు. తమిళంలో మాత్రం దుమ్ము దులిపేసింది.
వారీసుగా తమిళంలో రూపొందిన ఈ చిత్రం దిల్ రాజుకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో 300 కోట్లు క్రాస్ చేసిందంటే ఏ స్థాయిలో దిల్ రాజుకు లాభాలు తెచ్చి పెట్టిందో ఊహించుకోవచ్చు. తెలుగు వర్షన్ ఫ్లాప్ అయిన తమిళ వర్షన్ లాభాల వర్షం కురిపించింది. ప్రస్తుతం సూర్య దేవర నాగవంశీ మరో నిర్మాత సాయి సౌజన్యతో కలిసి తమిళ హీరో ధనుష్‌తో సార్ అనే చిత్రం రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో వాతి పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ కింద మేకర్స్ కి 20 కోట్ల లాభాన్ని అందించినట్టు చెబుతున్నారు. తమిళ హీరోలతో చేస్తున్న సినిమాలు తెలుగులో పెద్దగా ఆడకపోయిన సరే నిర్మాతలకు కాసులు వర్షం కురిపిస్తున్నాయి. దీంతో మన అందరి వారి చూపు తమిళ హీరోలపై పడింది. ఈ నేపథ్యంలోనే తెలుగు నిర్మాతల సక్సెస్ ఫార్ములా అదిరిందని, సినిమాలు ఎలా ఉన్నా ఏ భాషలో ఆడినా ఆడకపోయినా నిర్మాతలు, దర్శకులు, హీరోలకు లాభాలు రావడమే ముఖ్యం. ఇక్కడ కమర్షియల్ విజయాలే గీటు రాయి కాబట్టి మన వారి కొత్త పంథా అదిరిందనే అందరూ కామెంట్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



