అనిరుధ్ కోసం క్యూ కడుతున్న టాలీవుడ్ మేకర్స్
on Aug 13, 2023

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. తమిళంలో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్‌ను అందించారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం అడుగు పెట్టటానికి చాలా కాలమే అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న దేవర సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇదే తరుణంలో ఆయన సంగీతం అందించిన జైలర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సినిమాలో ఎలివేషన్ సీన్స్‌కు అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ రేంజ్‌లో ఉందంటూ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ స్టార్ మేకర్స్ అనిరుధ్ ను సంప్రదించే పనుల్లో బిజీగా ఉంటున్నారు.
తమిళంలోనే అనిరుధ్ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు నుంచి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఏకంగా సినిమాకు రూ.10 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. నిజంగా ఇది టెంప్టింగ్ ఆఫర్. అయితే ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫర్‌కు ఓకే చెప్పాలంటే ఓ కండీషన్ పెడుతున్నారు. అదేంటంటే.. తగిన సమయం లేకుండా తనను తొందర పెడితే సంగీతం అందించలేనని, కావాల్సినంత టైమ్ ఇస్తేనే సంగీతం చేయటానికి ఒప్పుకుంటానని అంటున్నారు. అయితే అనిరుధ్ ఒప్పుకుంటే చాలని మన నిర్మాతలు వెయిటింగ్ చేస్తున్నారు.
నిజానికి దేవర కంటే ముందు అజ్ఞాతవాసి సినిమాతో అనిరుద్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ కావటంతో అనిరుద్‌ను మన మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు. 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలు చేసినా అవి మాస్ సినిమాలు కాదు. అయితే ఇప్పుడు విక్రమ్, జైలర్ సినిమాల ప్రభావంతో మళ్లీ తెలుగు మేకర్స్ తన వెనుకపడుతున్నారు. అంతే మరి.. టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయని అనిరుధ్ నిరూపించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



