
టాలీవుడ్‌లో ఎన్నో కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చాయి. కానీ కౌబాయ్ సినిమాల విషయానికి వస్తే మాత్రం ముందుగా గుర్తొచ్చే పేరు సూపర్‌స్టార్ కృష్ణ. అప్పట్లో తెలుగు సినిమా అంటే పౌరాణికాలు, జానపదాలు, ఫ్యామిలీ డ్రామాలే ఎక్కువగా ఉండేవి. అలాంటి సమయంలో ఏకంగా వెస్ట్రన్ స్టైల్‌లో కౌబాయ్‌గా కనిపించి ఆడియన్స్‌ను మెప్పించారు కృష్ణ.
ఆ సినిమా మరేదో కాదు.. ‘మోసగాళ్లకు మోసగాడు’. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1971 ఆగస్టు 27న విడుదలైంది. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి కౌబాయ్ సినిమాగా ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజస్థాన్ ఎడారులు, గుర్రాలు, తుపాకులు, ట్రెజర్ హంట్.. అప్పటివరకు తెలుగు తెరపై కనిపించని విజువల్స్‌తో ఈ సినిమా కొత్త అనుభూతిని ఇచ్చింది.
ఈ సినిమా సక్సెస్ తర్వాత కౌబాయ్ కథలపై టాలీవుడ్‌లో ఆసక్తి పెరిగింది. కృష్ణ కూడా ఆ తర్వాత ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని సినిమాలు చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకుల మదిలో కౌబాయ్ అంటే కృష్ణ అనే ఇమేజ్ బలపడింది.

కౌబాయ్ జానర్‌ను తర్వాతి తరాల నటులు కూడా టచ్ చేశారు. కౌబాయ్ జానర్‌ను భారీ స్థాయిలో చూపించిన సినిమాల్లో ‘కొదమ సింహం’ ఒకటి. కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రఫ్ అండ్ టఫ్ కౌబాయ్ పాత్రలో కనిపించారు. గన్స్, గుర్రాలు, విభిన్న ప్రపంచంతో సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 1990లో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇందులో మోహన్ బాబు పోషించిన విలన్ రోల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ.. అసలు ఈ కాకుల కథేంటి.?
సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబు కూడా కౌబాయ్ అవతార్‌లో కనిపించడం విశేషం. జయంత్ సి. పరంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్కరి దొంగ’ 2002 జనవరి 12న విడుదలైంది. అమెరికాలోని లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సినిమా స్టైలిష్ వెస్ట్రన్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కింది.
ముఖ్యంగా మహేష్ బాబు కౌబాయ్ గెటప్, గుర్రపు స్వారీ, గన్‌ఫైట్స్ అప్పట్లో ప్రత్యేకంగా నిలిచాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మహేష్ కెరీర్‌లో మాత్రం ఇది ఒక డిఫరెంట్ జానర్ మూవీగా మిగిలిపోయింది.

ఇలా చూస్తే.. కృష్ణతో మొదలైన తెలుగు కౌబాయ్ సినిమాల ప్రయాణం.. చిరంజీవి ‘కొదమ సింహం’ వరకు భారీ స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘టక్కరి దొంగ’తో మరోసారి ఈ జానర్‌ను టచ్ చేశారు.
అయితే కౌబాయ్ పాత్ర అంటే ఇప్పటికీ ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం కృష్ణదే. 1971లో ‘మోసగాళ్లకు మోసగాడు’తో కృష్ణ సెట్ చేసిన ఆ ట్రెండ్.. ఐదు దశాబ్దాలు దాటినా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగానే నిలిచిపోయింది.
మీకు నచ్చవచ్చు:
సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.!
మోహన్ బాబు విలనిజం.. మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.!
[Tollywood Cowboy Movies, Mosagallaku Mosagadu, Kodama Simham, Takkari Donga, Super Star Krishna, Chiranjeevi, Mohan Babu, Mahesh Babu, Telugu Film News]





