సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా కథ, షూటింగ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా మహేష్‌బాబు లుక్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
‘వారణాసి’లోని కొన్ని కీలక సన్నివేశాల్లో మహేష్‌బాబు ఏకంగా 24 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే సాధారణంగా హీరోలను చిన్న వయసు పాత్రల్లో చూపించేందుకు ప్రస్తుతం ఏఐ, డీ-ఏజింగ్ టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో టెక్నాలజీపై ఆధారపడకుండా సహజమైన మేకోవర్‌తోనే మహేష్‌బాబుకు యంగ్ లుక్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: చిరంజీవి చెయ్యాల్సిన ‘బాషా’.. కేవలం 15 లక్షల వల్ల రజినీకాంత్ దగ్గరకు వెళ్లింది.!
దీని కోసం మహేష్‌బాబు ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్, మేకప్, మొత్తం లుక్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సన్నివేశాల్లో మహేష్‌బాబు తన కెరీర్ ప్రారంభ దశను గుర్తు చేసేలా కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా ‘మురారి’, ‘ఒక్కడు’ వంటి సినిమాల నాటి మహేష్‌బాబు లుక్‌ను అభిమానులకు గుర్తుచేసే విధంగా ఈ మేకోవర్ ఉండనుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ‘వారణాసి’ సాధారణ కథతో తెరకెక్కుతున్న సినిమా కాదని ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కథనం వేర్వేరు ప్రాంతాలు, కాలాలను దాటుకుంటూ సాగుతుందని సమాచారం. సినిమాలో మహేష్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు మహేష్‌బాబు ఈ సినిమా కోసం శారీరకంగా కూడా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. పాత్రకు తగ్గట్టుగా మార్షల్ ఆర్ట్స్‌తో పాటు తన నడక, పరుగులోనూ మార్పులు చేసుకునేందుకు శిక్షణ తీసుకున్నట్లు గతంలో వెల్లడైంది. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: కృష్ణ పని అయిపోయిందనుకున్నారు. కానీ, చిరంజీవి, నాగార్జునకు షాక్ ఇచ్చిన సూపర్‌స్టార్.!
| మోహన్ బాబు విలనిజం: మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.! |
[Mahesh Babu Varanasi, Mahesh Babu 24 Years Look, Varanasi Movie, SS Rajamouli Varanasi, Mahesh Babu Makeover, Mahesh Babu Young Look, Priyanka Chopra Varanasi, Prithviraj Sukumaran, Varanasi Movie Update, Mahesh Babu Rajamouli Movie]






