`చిన్న` నెల ఫిబ్రవరిలో `పెద్ద` సినిమాల సందడి!
on Oct 25, 2021

సాధారణంగా ఫిబ్రవరి మాసాన్ని చిత్ర పరిశ్రమ `అన్ సీజన్`గా పరిగణిస్తుంది. అయితే, అలాంటి నెలలోనూ `మిర్చి` (2013) వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కట్ చేస్తే.. 2022లోనూ ఈ తరహా సినిమాలు సందడి చేయబోతున్నాయి. వాటిలో రెండు తెలుగు చిత్రాలు ఉండగా.. మరొకటి హిందీ సినిమా. ఇవన్నీ మల్టిస్టారర్సే కావడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం `ఆచార్య`. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామా.. 2022 ఫిబ్రవరి 4న థియేటర్స్ లోకి రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజైన మూడు వారాల తరువాత అంటే ఫిబ్రవరి 25న మరో అగ్ర కథానాయకుడు నటిస్తున్న తెలుగు చిత్రం రాబోతోంది. ఆ సినిమానే.. విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న `ఎఫ్ 3`. ఇందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో కథానాయకుడు. అంతేకాదు.. ఇదే నెలలో మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన హిందీ చిత్రం `లాల్ సింగ్ చద్ధా` కూడా తెరపైకి రానుంది. ఇందులో టాలీవుడ్ స్టార్ నాగచైతన్య మరో హీరోగా నటించాడు. ఫిబ్రవరి 11న ఈ కామెడీ డ్రామా రిలీజ్ కానుంది. అంతేకాదు.. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అనువాదమయ్యే అవకాశముందంటున్నారు.
మరి.. `చిన్న` నెల ఫిబ్రవరిలో రాబోతున్న ఈ `పెద్ద` సినిమాలు.. ఎలాంటి సంచలనం సృష్టిస్తాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



