
అభిమానులకి, సినీ ప్రియులకి అత్యంత ఇష్టమైన పదం ఏదైనా ఉంది అంటే ప్రీమియర్ షో. తమ అభిమాన హీరో ప్రీమియర్ షో చూసీ చదువులో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళలాగా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది. మరి అలాంటి ప్రీమియర్ వల్ల సినిమాకి లాభమా, నష్టమా? ఏ చిత్రాలు పోటీలో ఉన్నాయనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. మరి ఆ డిస్కర్షన్ తాలూకు మాటర్ చూద్దాం.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' కి ప్రీమియర్స్ వేస్తామని మేకర్స్ అధికారకంగా చెప్పేసారు ఫౌజీ విడుదలైన మరుసటి రోజే బాలీవుడ్ అగ్ర నటులు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ నటించిన రెండు భారీ హిందీ చిత్రాలు థియేటర్లలోకి అడుగుపెడుతుండడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు విడుదలైన కేవలం 2 వారాల వ్యవధిలోనే హాలీవుడ్ విజువల్ వండర్స్ 'అవెంజర్స్', 'డ్యూన్' సీక్వెల్స్ కూడా బరిలోకి దిగుతుండటంతో ప్రీమియం 4DX, ఐమ్యాక్స్ స్క్రీన్ల షేరింగ్ విషయంలో తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. మరోవైపు న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాపై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. మొదటిసారిగా ఆయన నటిస్తున్న ఒక సినిమా బడ్జెట్ 200 కోట్ల మార్కు దాటిపోయింది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ కోసం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంతో, తొలుత ప్రకటించిన ఆగస్టు 21 తేదీ నుండి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. సినిమా నాణ్యతపై మేకర్స్‌కు పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, భారీగా పెరిగిన బడ్జెట్ మరియు వాయిదా పడ్డ విడుదల తేదీ నిర్మాతలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. 'ది పారడైజ్' బాక్సాఫీస్ వద్ద సాధారణ హిట్ సాధిస్తే సరిపోదు, నిర్మాతలకు లాభాలు రావాలంటే ఓపెనింగ్ డే నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించాల్సి ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో ఒక సినిమా విజయాన్ని తొలి రోజు ప్రీమియర్ షోల టాక్, అర్ధరాత్రి షోల కలెక్షన్లే శాసిస్తున్నాయి.
also read: మదురై లో త్రిష కలకలం.. త్రిష నర్పణి మన్త్రమ్ అంటూ పోస్టర్స్
గతంలో వారాంతం వరకు సాగే బాక్సాఫీస్ ప్రయాణం, ఇప్పుడు గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ప్రీమియర్ షోల వరకే పరిమితమైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్ కలెక్షన్లను రాబట్టడానికి నిర్మాతలు వినూత్న వ్యూహాలు వేస్తున్నారు. విదేశాలలో గురువారం సాయంత్రం వేసే ప్రీమియం స్క్రీనింగ్స్ ద్వారా వందల కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ఒకవేళ మొదటి షోకే పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు 300 కోట్లకు పైగా మార్కును సునాయాసంగా అందుకుంటున్నాయి. అదే సమయంలో తేడా వస్తే ఊహించని నష్టాలు తప్పవు. అందుకే ప్రీమియర్స్ అనేవి కత్తి మీద సాము లాంటివనే అభిప్రాయం కొందరిలో ఉంది. డిసెంబర్ రేసులో ప్రభాస్ 'ఫౌజీ'కి బాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా స్వదేశీ దిగ్గజాల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. బిగ్ బడ్జెట్ సినిమాలైన ఫౌజీ, ది పారడైజ్ మాత్రమే కాదు, 2026 సెకండాఫ్‌లో రాబోతున్న ప్రతీ పాన్-ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా నిరూపించుకోవాలంటే సరైన పబ్లిసిటీ వ్యూహం, కచ్చితమైన ప్రీమియర్ టైమింగ్స్, ప్రచార కంటెంట్ అత్యంత కీలకం కానున్నాయి.
Fauji, The Paradise, Tollywood





