Home

»

Latest News

ఆగస్టు 28న రిలీజ్ అవుతున్న 'చిరంజీవి' సినిమా.!

Aug 4, 2026 5:15PM

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా 'చిరంజీవి'. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి,శ్రీకాంత్  భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. 

'చిరంజీవి' సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

టీజర్ ఎలా ఉందో చూస్తే.. చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట వారి గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె కొట్టుకోవడం గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్. చిరంజీవి ప్లేస్ లో ఎవరో ఉన్నారని ఆమెకు అర్థమవుతోంది. ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపిస్తూ టీజర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది. 

ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది 'చిరంజీవి' సినిమా.

 

 

Chiranjeevi, Telugu Cinema, Tollywood

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com