థగ్ లైఫ్ మూవీ రివ్యూ
on Jun 5, 2025
తారాగణం: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తదితరులు
సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
డీఓపీ: రవి కె. చంద్రన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్
రచన: మణిరత్నం, కమల్ హాసన్
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్
బ్యానర్స్: రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్
విడుదల తేదీ: జూన్ 5, 2025
లోకనాయకుడు కమల్ హాసన్, లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'థగ్ లైఫ్' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో చూద్దాం.
కథ
రంగరాయ శక్తివేల్ నాయకర్ అలియాస్ శక్తివేల్ రాజ్( కమల్ హాసన్) పేరున్న ఒక గ్యాంగ్ స్టర్. రాజ్యం, అధికారం కోసం అన్నదమ్ములు, తండ్రి కొడుకులు ఒకరినొకరు చంపుకుంటారనే, భావాన్ని బలంగా నమ్ముతాడు. భార్య లక్ష్మి(అభిరామి),పెళ్లీడుకొచ్చిన కూతురు అంటే ఎంతో ప్రేమ. గతంలో శక్తివేల్, పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో అమర్ ( శింబు) తండ్రి చనిపోతాడు. దీంతో ఏడేళ్ల వయసున్నఅమర్ ని శక్తివేల్ తన ఇంటికి తీసుకెళ్లి కొడుకుగా పెంచుతాడు. ఆ కాల్పుల టైంలోనే ఆరేళ్ల వయసున్న అమర్ చెల్లెలు చంద్ర(ఐశ్వర్య లేష్మి) తప్పిపోతోంది.దీంతో ఎప్పటికైనా నీ చెల్లెలని నీకు అప్పగిస్తానని అమర్ కి శక్తివేల్ మాటిస్తాడు. శక్తీ వేల్ కి సంబంధించిన గ్యాంగ్ వ్యవహారాలన్నింటిని అమర్ చూస్తు ఉంటాడు. సదానంద్(మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్, శక్తీ వేల్ ని చంపటానికి ట్రై చేస్తుంది. ఇంద్రాణి (త్రిష) తనకి ఇష్టం లేకపొయినా, ఒక ముఠా వల్ల కాల్ గర్ల్ గా బతుకుతుంటే, శక్తీ వేల్ ఆమెని కాపాడతాడు. ఇద్దరకీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడటంతో రిలేషన్ లో ఉంటారు. శక్తీ వేల్ కి సంబంధించిన ఒక రహస్యాన్ని అమర్ కి శక్తీ వేల్ అన్నయ్య మాణిక్యం (నాజర్) చెప్తాడు. దీంతో అమర్ కి శక్తివేల్ శత్రువుగా మారతాడు. శక్తీ వేల్ గురించి అమర్ కి మాణిక్యం చెప్పింది నిజమేనా! శక్తివేల్ ని చంపడానికి అమర్ ఏం చేసాడు? తనని చంపాలనుకున్న అమర్ ని శక్తివేల్ ఏం చేసాడు? ఆ పోరాటంలో ఎవరు గెలిచారు? ఎవరు బలయ్యారు? తన చెల్లెలని తెచ్చి ఇస్తానని అమర్ కి మాట ఇచ్చిన శక్తివేల్ అది నెరవేర్చాడా? చివరకి ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే థగ్ లైఫ్ కథ
ఎనాలసిస్
గ్యాంగ్ స్టర్ అనే పాయింట్ ని కథావస్తువుగా ఎంచుకున్నారు గాని, దాని పరిధి ని మాత్రం ఎక్కువ గాచూపించలేదు.బయట ప్రపంచంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే చూపించారు. సినిమాకి కావాల్సిన నాటకీయత అనేది లోపించింది. చాలా సీన్స్ ని కావాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమా చివర వరకు ఇదే పంథాతో వెళ్లారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కమల్ హాసన్ ఎంట్రీ తో పాటు ఆయన క్యారక్టర్ చెప్పిన డైలాగులుతో, మొదటి పావుగంట ఇంట్రెస్ట్ గానే అనిపిస్తుంది. కానీ సీన్స్ వచ్చే కొద్దీ సినిమాలో ఏమి లేదని అర్ధమవుతుంది. క్యారెక్టర్స్ ఎలివేషన్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. కానీ కథని సృష్టించలేకపోయారు. అమర్ తో శక్తీ వేల్ రాజ్ తన చెల్లెల్ని ఎప్పటికైనా తెచ్చి ఇస్తానంటాడు. కాబట్టి చంద్ర క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని పోలీస్ ఆఫీసర్ గా పెట్టి అమర్ కి ఆమెకి మధ్య గొడవని సృష్టించాల్సింది. దీంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో కథలో ఏమైనా స్పీడ్ ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. కమల్ పగ తీర్చుకోవడంతోనే సరిపోయింది. ఇంద్రాణిగా త్రిష క్యారక్టర్ ప్రధాన మైనస్ గా నిలిచింది. కథ లో ముఖ్యమైన క్యారక్టర్ గా ఆమెని మార్చుకోవచ్చు. కానీ ఆ విధంగా చెయ్యలేదు. ఇంద్రాణి ని అమర్ తీసుకెళ్లడం అనే పాయింట్ ని మాత్రం అసలు జీర్ణించుకోలేం. శక్తి వేల్ రాజ్ పై కోపంతోనే తీసుకెళ్లాడు. ఆమె ఒంటి మీద చెయ్యి కూడా వెయ్యలేదంటే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
కమల్ హాసన్(Kamal Haasan)మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించడంతో పాటు, రంగరాయ శక్తివేల్ నాయకర్ క్యారక్టర్ తన కోసమే పుట్టినట్టుగా జీవించాడు. కళకి సంబంధించి ఎన్ని వేరియేషన్స్ ఉంటాయో,వాటన్నింటిలో తన గ్రిప్ ఏ మాత్రం తగ్గదని కూడా మరోసారి చాటి చెప్పినట్టయింది.. అమర్ క్యారక్టర్ లో శింబు నటనలో మెరుపులు లేకపోయినా, పాత్ర పరిధి మేరకి బాగానే చేసాడు. అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ,ఇలా మిగతా పాత్రల్లో చేసిన అందరు తమ పాత్రల మేరకు మెప్పించారు. ఫొటోగ్రఫీ మూవీకి ప్రాణంగా నిలిచింది. ఏ ఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని చోట్ల తేలిపోయింది. సీన్ కి సంబంధం లేకపోయినా మ్యూజిక్ వచ్చింది. ఇక దర్శకుడిగా మణిరత్నం సక్సెస్ అయినా కథనంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. డైలాగ్స్ తో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే ఒకే పాయింట్ పై సినిమా నడవడం, కథనాల్లోని లోపాలు థగ్ లైఫ్ కి మైనస్
రేటింగ్ 2 /5
అరుణా చలం
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
