Home

»

Latest News

ప్రేక్షకులని మోసం చేసిన మేకర్స్: థియేటర్లలో తీవ్ర నిరాశ! 

Oct 2, 2026 6:06PM


ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు గాని, నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరని సినిమా వాళ్లే ఒక ఫేమస్ సినిమాలో డైలాగ్ రాసారు. కానీ ఇప్పుడు ప్రేక్షకులని మోసం చేసిన మేకర్స్ ఉంటారేమో గాని, మేకర్స్ ని మోసం చేసిన ప్రేక్షకులు లేరు అనే కొటేషన్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.

గాంధీ జయంతి తో పాటు వీకెండ్ కావడంతో థియేటర్స్ అన్ని ప్రేక్షకులతో కళకళ లాడుతున్నాయి. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లో అయితే వయసుతో తారతమ్యం లేకుండా  జాతర వాతావరణం. దీంతో అక్కడ పని చేసే స్టాఫ్ ముఖాల్లో సంతోషం ఒక రేంజ్ లో ఉంది. కానీ థియేటర్ నుంచి బయటకి వచ్చిన ప్రేక్షకుడి ముఖం మాత్రం డల్.  మేకర్స్ ప్రకటనలు, ప్రమోషన్లు చూసి థియేటర్ల వైపు అడుగులు వేసిన సినీ ప్రియులని  కంటెంట్ లేని సినిమాలు తీవ్రంగా అసంతృప్తికి గురిచేశాయి. ఫహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', సందీప్ కిషన్ 'సిగ్మా', గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'అనకాపల్లి' లాంటి చిత్రాలతో పాటు భారీ నిర్మాణ విలువలతో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ మూటగట్టుకున్నాయి.   


స్టార్ కాస్టింగ్, అగ్ర నిర్మాణ సంస్థల బ్యాకింగ్ ఉన్నప్పటికీ, సరైన కథాబలం మరియు స్క్రీన్‌ప్లే లోపించడంతో ఈ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. నేడు విడుదలైన నాలుగు ప్రముఖ చిత్రాల సగటు బాక్సాఫీస్ రేటింగ్‌లు 2.0/5 నుండి 2.75/5 మధ్యకే పరిమితమవ్వడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఫస్ట్ హాఫ్‌లో కొంత వినోదాన్ని పంచినప్పటికీ, ప్రిడిక్టబుల్ కథ మరియు వీక్ సెకండాఫ్ కారణంగా 2.25/5 నుండి 2.75/5 రేటింగ్స్ కే పరిమితమైంది. కథలోని ప్రధాన భావోద్వేగాలు ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడమే దీనికి ప్రధాన కారణం.మరోవైపు తమిళ ప్రముఖ నటుడు విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన 'సిగ్మా' చిత్రం హీస్ట్ డ్రామాగా తెరకెక్కినప్పటికీ, కథనంలో పట్టు లేక బాక్సాఫీస్ వద్ద 2.25/5 రేటింగ్ తో నిరాశపరిచింది. 

ఇది కూడా చదవండి: ఎందుకు ఇట్లా చేసిండ్రు: 'సిగ్మా' టాక్ వెనక ఉన్న అసలు నిజాలు!


సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా లాంటి నటీనటుల ప్రతిభను ఈ సినిమా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. అలాగే క్రైమ్, తీవ్రమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో వచ్చిన 'అనకాపల్లి' కూడా నేటి ప్రేక్షకుల అభిరుచికి తగిన రీతిలో లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి నైరాశ్యాన్నే మూటగట్టుకుంది. ఇంప్యూర్ అనే మరో మూవీ కూడా ఒక ఉదాహరణ. ఈ విధమైన నెగెటివ్ వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలిగించిన చిత్రం 'తెల్లకాగితం'. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిన్న సినిమాకు 2.5/5 రేటింగ్‌తో పాటు పాజిటివ్ టాక్ లభిస్తోంది. ప్రథమార్ధంలో అమాయకత్వంతో కూడిన కామెడీ మరియు యూత్‌కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పెద్ద సినిమాలు కంటెంట్ లేక బోల్తా పడుతున్న వేళ, చిన్న చిత్రమైన 'తెల్లకాగితం' బాక్సాఫీస్ వద్ద కొంతవరకు ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. రాబోయే రోజుల్లో మేకర్స్ కేవలం పబ్లిసిటీపైనే కాకుండా స్క్రిప్ట్ బలంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ వారం బాక్సాఫీస్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.  మరి దీన్ని బట్టి ఏం అర్ధమయ్యింది. వరుస సెలవుల మధ్య అరడజను సినీ పండుగ వచ్చిందని ప్రేక్షకుడు, సినీ ప్రేమికుడు సంబరపడుతుంటే వాళ్ళ నమ్మకాన్ని నీటి బుడగ చేసారు.

 

[This week Released Telugu Movies Reviews, This week Released Movies Public Talk, Sigma Movie Public Talk, Sigma Movie Review Telugu, Dont Trobule The dont Trobule, sigma Movie Review In Telugu, Sigma Movie Review, Sundeep Kishan Sigma Movie Review]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com