కొన్ని సినిమా జోడీలు ఎన్ని సంవత్సరాలు గడిచినా ప్రేక్షకుల మనసుల్లో అలాగే గుర్తుండిపోతాయి. అలాంటి జోడీల్లో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట ఒకటి. 2008లో వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట.. ఆ తర్వాత మళ్లీ కలిసి నటించలేదు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే ఈసారి ప్రేమకథతో కాకుండా ఓ ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌తో జతకట్టారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ అనే కొత్త ఓటీటీ ఒరిజినల్‌కు సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
‘నా వైఫ్ మిస్సింగ్’ టైటిల్‌కు తగ్గట్టుగానే కథ మొత్తం ఓ మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో వరుణ్ సందేశ్ బాలు అనే బ్యాంకు ఉద్యోగి పాత్రలో కనిపించనున్నారు. తన భార్య కనిపించడం లేదంటూ అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టడంతో అసలు భార్య ఏమైంది? ఆమె ఎక్కడికి వెళ్లింది? ఈ మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. గ్లింప్స్‌లో కనిపించే కొన్ని సన్నివేశాలు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో వరుణ్ సందేశ్ పోషించిన పాత్ర పేరు కూడా బాలు కావడం విశేషం. ఇప్పుడు ‘నా వైఫ్ మిస్సింగ్’లోనూ ఆయన బాలు పాత్రలోనే కనిపించనున్నారు. అయితే అప్పటి లవ్ స్టోరీకి పూర్తి భిన్నంగా ఈసారి సస్పెన్స్, క్రైమ్ నేపథ్యంలో కథ సాగనుంది. శ్వేతా బసు ప్రసాద్ వరుణ్ సందేశ్ భార్య పాత్రలో నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రాన్ని స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌తో పాటు ప్రవీణ్, మోహిత్, జబర్దస్త్ సత్యశ్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘నా వైఫ్ మిస్సింగ్’ అందుబాటులోకి రానుంది. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్.. స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మరి భార్య నిజంగానే మిస్సయ్యిందా? ఆమె అదృశ్యం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సిరీస్ వచ్చే వరకు ఆగాల్సిందే.
[Naa Wife Missing, Varun Sandesh, Shweta Basu Prasad, Varun Sandesh Shweta Basu Reunite, Kotha Bangaru Lokam Pair, Naa Wife Missing OTT, Naa Wife Missing Aha, Varun Sandesh New Movie, Shweta Basu Prasad New Movie, Telugu Crime Thriller, Aha Original Movie]




.webp)
