హీరో విజయ్ ' పోలీసోడు ' పోస్టర్ వచ్చేసింది..!
on Apr 2, 2016

తమిళ్ లో తేరీగా రిలీజవుతున్న ఇళయదళపతి విజయ్ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు పోలీసోడు అనే టైటిల్ ను కన్ఫామ్ చేశారు. రాజా రాణి సినిమాతో తెలుగులో కూడా హిట్ కొట్టిన అట్లీ డైరెక్షన్లో తేరీ తెరకెక్కింది. దిల్ రాజు తీసుకున్న సినిమా కావడంతో, పోలీసోడు పై అంచనాలు బాగున్నాయి. విజయ్ కు జంటగా సమంత, అమీ జాక్సన్ నటించారు. దీని కోసం రూపొందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగులో రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్లో మంటలతో, విజయ్ చేతిలో తుపాకీతో పరిగెత్తుకుంటూ వస్తున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. తమిళ తేరీ టైటిల్ డిజైన్ కు దగ్గరగా ఉండేలా పోలీసుడు అన్న పదాన్ని డిజైన్ చేశారు. ఈ సినిమా రెహమాన్ మేనల్లుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన 50 వ సినిమా కావడం విశేషం. అజిత్ ఎంతవాడు కానీ లో పాప పాత్ర చాలా కీలకం. తేరీ ట్రైలర్లో చూస్తే, ఈ సినిమాలో కూడా చిన్న పాప పాత్ర చాలా కీలకమని తెలుస్తోంది. ఈ పాత్రను మీనా కూతురు చేయడం విశేషం. ఏప్రిల్ 14న తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తేరీ, పోలీసోడు గా ఈ సినిమా వస్తుండటం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



