అప్పుడు ‘బిజినెస్ మేన్’.. ఇప్పుడు ‘గుంటూరు కారం’.. మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?
on Jul 5, 2023

2024 సంక్రాంతి కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 'గుంటూరు కారం'.. ముగ్గుల పండక్కి రాబోతుండడమే ఇందుకు కారణం. 'ధమాకా' భామ శ్రీలీల హీరోయిన్ గా ఎంటర్టైన్ చేయనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ .. వచ్చే ఏడాది జనవరి 13న జనం ముందుకు రానుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో ఇదే జనవరి 13న మహేష్ బాబు హీరోగా నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ సినిమానే 'బిజినెస్ మేన్'. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన సదరు చిత్రం అప్పట్లో మహేష్ బాబుకి సరికొత్త ఇమేజ్ ని తెచ్చింది. మరి.. అదే జనవరి 13న రాబోతున్న 'గుంటూరు కారం' కూడా 'బిజినెస్ మేన్'లా జనాల్ని రంజిపజేస్తుందేమో చూడాలి. కొసమెరుపు ఏమిటంటే.. 'బిజినెస్ మేన్'కి మ్యూజిక్ అందించిన థమన్ 'గుంటూరు కారం'కి కూడా వర్క్ చేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



