Home

»

Latest News

తెల్ల కాగితం మూవీ రివ్యూ

Oct 2, 2026 1:02AM

నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర, అజయ్, శరణ్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి

సాంకేతిక బృందం:

రచన: నందు సవిరిగాన

సంగీతం: విజయ్ బుల్గానిన్

సినిమాటోగ్రఫీ: కె.వి. గుహన్

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

దర్శకత్వం: రమేష్ బండిరెడ్డి

నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి

 

హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన తెల్ల కాగితం ( Thella Kaagitham) సినిమా లీకైన ఇంటిమేట్ సీన్, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ థీమ్‌తో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ రోజు విడుదలైన ఈ యువతరం చిత్రం, తెరపై ఈ కథాంశాన్ని ఎలా ఆవిష్కరించిందో వివరంగా చూద్దాం.

 

కథ:

రాము (Harsh Roshan) తన క్లాస్‌మేట్ ఆశా (Nakshatra)తో ప్రేమలో పడతాడు. మొదట ఆమె అంగీకరించకపోయినా, అతని ప్రయత్నాలతో ప్రేమలో పడుతుంది. ఒకరోజు వారు శారీరకంగా దగ్గరవుతారు. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చిందనే ఆందోళన మొదలవుతుంది. అది నిజమని తెలిశాక, ఈ విషయాన్ని తల్లిదండ్రుల నుంచి దాచడానికి ఇద్దరూ పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆ తర్వాత ఏం జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

విశ్లేషణ:

అమాయక యువకుడి పాత్రలో హర్ష్ రోషన్ నటన బాగుంది. అయితే, ఇలాంటి సున్నితమైన సినిమాల్లో ఉండే రెగ్యులర్ టెంప్లేట్ కారణంగా, అతను కొత్తగా చేయడానికి ఏమీ లేదు. అయినా తన వంతు న్యాయం చేశాడు. 

నక్షత్ర బాగానే చేసినా, సెకండాఫ్‌లో ఆమె పాత్ర కేవలం భయపడటం, ఏడవడంకే పరిమితమైంది. అజయ్, శరణ్య పాత్రలు పెద్దగా ప్రభావం చూపలేదు.

సినిమా సింపుల్‌గా సాగినంత సేపు బాగానే అనిపిస్తుంది. యువతీయువకుల మధ్య ఉండే పరిపక్వత లేని ప్రేమను ఫస్ట్ హాఫ్‌లో చక్కగా చూపించారు. కానీ, సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కొత్తదనం లోపించి కథ సాగదీసినట్లు అనిపిస్తుంది. అనవసరమైన మెలోడ్రామా తగ్గించి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా ఉండేది. 

కథను సులభంగా ఊహించగలగడం పెద్ద మైనస్, కానీ ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజింగ్‌గా ఉంటుంది. సంగీతం, ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. కొన్ని చోట్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. మొత్తంగా, సాగదీసిన మెలోడ్రామా సినిమాకే ప్రతికూలంగా మారింది.

 

ప్లస్ పాయింట్స్:

హర్ష్ రోషన్, నక్షత్ర మధ్య కెమిస్ట్రీ

ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్

సామాజిక సందేశం

రెండు పాటలు

 

మైనస్ పాయింట్స్:

కొత్తదనం లేని కథ 

నెమ్మదిగా సాగే కథనం

మోతాదు మించిన మెలోడ్రామా 

సెకండాఫ్ క్రైసిస్‌లో సాగతీత

చప్ప గా సాగే క్లైమాక్స్

 

చివరి గా: నిర్ణయం తీసుకోలేని వయసు తొందరపాటు తెచ్చే సందిగ్ధతపై ఒక తెల్ల కాగితం, కానీ మరీ సాగదీశారు.

 

రేటింగ్: 2.5/5

 

గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. వీటికి సంస్థకు

ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ విచక్షణతో వ్యవహరించగలరు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com